పవర్ లేని కుర్చీ కోసం పోటాపోటీ..ఆ పార్టీలో సీన్ మామూలుగా లేదుగా?
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడన్న పదవి అంత తేలికైనది కాదు. కానీ.. ఇప్పుడా పదవికి పెద్ద ఛార్మ్ లేదు. అందునా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా మారుతోంది. తాజాగా వెల్లడైన గ్రేటర్ ఫలితాన్ని చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ లో కనీసం ఐదు డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉందనుకుంటే.. కేవలం రెండింటిలోనూ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా.. పార్టీ అభ్యర్థుల పుణ్యమే తప్పించి.. పార్టీ ప్రభావం ఏ మాత్రం లేదన్నది మర్చిపోకూడదు.
ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిననేతలు పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని మొహరించి.. పెద్ద ఎత్తున పని చేశారు. అయినప్పటికీ ఫలితం శూన్యం. వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీకి దారుణ ఫలితాన్ని నమోదు చేసిన నేపథ్యంలో.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలోనూ ఆయన తన పదవికి రాజీనామా చేయటం.. అధిష్ఠానం ఆయన్ను కంటిన్యూ చేయటం తెలిసిందే.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉత్తమ్ స్థానే మరో నేతను నియమించటం మంచిదన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధినాయకత్వం. దీంతో.. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటానికి పోటీ మొదలైంది. ఈ రేసులో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ముందున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మిగిలిన నేతలు.. ఎవరికి వారుగా తాము కూడా రేసులో ఉన్నట్లుగా ప్రకటించుకుంటున్నారు. ఈ మధ్యన హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రాత్రివేళ జరిగిన రహస్య సమావేశంలో కొందరు నేతలు కలిసి.. మాజీ మంత్రి శ్రీధర్ బాబును ఎంపిక చేశారు. శ్రీధర్ బాబు అయితే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఇంతలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్ష రేసులో ఉన్నట్లు చెప్పుకోగా.. తానేం తక్కువ తినలేదన్నట్లుగా జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు. తాజాగా మరో కృష్ణుడు తెర మీదకు వచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు.. సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కూడా తనకు పీసీసీ పీఠం మీద ఉన్న ఆసక్తిపై ఓపెన్ అయ్యారు. ఇంత వయసులో అంత పెద్ద బాధ్యత అంటే.. తన వయసు వారు చాలా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నరని.. తాను పీసీసీ చీఫ్ పదవిని చేపట్టగలనని పేర్కొంటున్నారు.
ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. పవర్ లేని కాంగ్రెస్ అధ్యక్ష కుర్చీ కోసం ఆసక్తిని చూపించే పార్టీ నేతలు.. పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోవటం అంతే ఆసక్తిని ఎందుకు ప్రదర్శించరు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. మరింతమంది పోటీ పడుతున్న టీపీసీసీ పీఠాన్ని ఎవరికి కట్టబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.