వ్యాక్సిన్ దాచి పెట్టే సీన్ తెలంగాణకు ఉందా?
కళ్లుల్లో ఒత్తులు పెట్టుకొని మరీ ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చే టైం దగ్గరకు వచ్చింది. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి దూకుడుకు కళ్లాలు వేయటంతో పాటు.. దాన్ని జయించేందుకు జరుగుతున్న ప్రయోగాలు తుదిదశకు రావటమే కాదు.. రష్యాలో జోరుగా వ్యాక్సినేషన్ సాగుతోంది. మన దేశంలోనూ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే ప్రక్రియను త్వరలోనే షురూ చేయనున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే వచ్చే ఏడాది మొదటి.. రెండో వారాల్లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ అధికారికంగా షురూ కానుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఇబ్బంది అంతా వ్యాక్సిన్ ను దాచి ఉంచేందుకు మౌలిక సదుపాయాలు ఎంతమేర ఉన్నాయి? వ్యాక్సిన్ ను ఎవరికి ముందు వేస్తారు? విడతల వారీగా ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో గందరగోళం చోటు చేసుకోకుండా ఎలాంటిజాగ్రత్తలు తీసుకుంటారు? లాంటి ప్రశ్నలకు సమాధానంగా పక్కా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదంతా ఒక ఎత్తు అయితే.. వ్యాక్సిన్ ను అత్యంత శీతలీకరణ ప్రదేశంలో దాచి ఉంచాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. దీనికి దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ చేస్తున్నాయి.
తెలంగాణ విషయానికి వస్తే.. వ్యాక్సిన్ ను దాచే శీతలీకరణ యూనిట్లు ఏ మేరకు ఉన్నాయి? అన్న అంశంపై యుద్ధప్రాతిపదికన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్.. వరంగల్ తదితర ప్రాంతాల్లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద టీకాను నిల్వ చేసే సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగులు ఉన్నాయి. అంతేకాదు.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే అన్ని ల్యాబ్ లలోనూ మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద టీకాను నిల్వ చేసే వీలుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ను ప్రత్యేక వాతావరణంలో దాచి ఉంచే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే మాట వినిపిస్తోంది. అంతేకాదు.. అవసరమైన ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన అతి శీతల యూనిట్లను కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో.. వ్యాక్సిన్ దాచేంత సీన్ మనకైతే ఉందని చెప్పక తప్పదు.