కోహ్లీ సోషల్ మీడియా 'దందా'.. ఒక్క పోస్టుకు రూ. కోట్లు

Update: 2020-10-25 01:30 GMT
టీమిండియా కెప్టెన్, ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్​ కోహ్లికి సోషల్​ మీడియాలో ఫాలోయింగ్​ మామూలుగా లేదు.  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఈ యువ క్రికెటర్​కు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీకి ఉన్న క్రేజ్​ను క్యాష్​ చేసుకొనేందుకు, తమ ప్రొడక్టులకు పబ్లిసిటీ తెచ్చుకునేందుకు కొన్ని కంపెనీలు అతడితో కాంటాక్ట్ కుదుర్చుకుంటున్నారు. దీంతో విరాట్​కు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.  ఇన్‌స్టాగ్రామ్​లో కోహ్లీకి  81.8మిలియన్ ఫాలోవర్లను ఉన్నారు. అయితే ఇన్​స్టా లో పెయిడ్​ పోస్టులు చేసినందుకు సదరు కంపెనీలు కోహ్లీ కి భారీగానే ముట్టజెపుతున్నాయట. ఒక్కో పెయిడ్ పోస్ట్‌కు విరాట్​ కు రూ .1.2 కోట్లు వస్తున్నట్టు టాక్​.

ట్విట్టర్‌లోనూ అదే తరహాలో డబ్బులు వస్తున్నాయి. ఒక్కో ట్వీట్‌కు రూ .2.5 కోట్లు కోహ్లాకి ఇస్తున్నాయట కంపెనీలు ట్విట్టర్లో కోహ్లీకి 38.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ ఒక్కడే కాదు.. చాలా మంది క్రికెటర్లు ఇలా సోషల్​మీడియా దందాలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఐపీఎల్‌ లో సారధిగా వ్యవహరిస్తుండగా.. గత ఐపీఎల్‌ల తో పోలిస్తే మెరుగ్గా టైటిల్ రేసులో పోటీ పడుతున్నాడు. క్రికెట్‌ లో రికార్డులు క్రియేట్ చెయ్యడం లో ముందు వరుస లో ఉండే కోహ్లీ.. సోషల్ మీడియా దిగ్గజాల్లో కూడా రికార్డు ఫాలోయింగ్‌ తో రాణిస్తున్నాడు.  ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా సోషల్ మీడియా తో భారీగానే సంపాదిస్తున్నది. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక ప్రమోషనల్ పోస్ట్‌ ద్వారా ప్రియాంక చోప్రా రూ .1.85 కోట్లు వెనకేసుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఆమెకు 58 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
Tags:    

Similar News