ధోని హెలికాప్టర్ షాట్ పుట్టిందిలా...
ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడం లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. సెహ్వాగ్ ఎలాంటి బాల్ నైనా శరీరాన్ని కదల్చకుండా బంతిని బలంగా బాది స్టాండ్స్ లోకి పంపగలడు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ కూడా బౌలర్ బంతి విసరగానే.. బ్యాట్ను నేలకు తాకిస్తూ.. బంతి సరాసరి కీపర్ తల మీదుగా స్టాండ్స్ లోకి వెళ్లేలా షాట్ ఆడతాడు. దీనికి దిల్ స్కూప్ అని పేరు పెట్టారు. అలా ధోనీకి కూడా హెలికాప్టర్ షాట్ చాలా ప్రత్యేకంగా మిగిలిపోయింది.
ఆ షాట్ పేరు చెబితే చాలు ధోనీనే గుర్తొస్తాడు. 2006లో గోవాలో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో జేమ్స్ అండర్సన్ విసిరిన ఫుల్ లెంగ్త్ బాల్ ని ధోని తనదైన స్టైల్ లో ఫ్లిక్ చేసి లెగ్ సైడ్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు. అయితే అప్పుడు ఆ షాట్ కు హెలికాప్టర్ షాట్ అనే పేరు రాలేదు. అయితే ఓ ప్రకటన కంపెనీ ధోనితో యాడ్ చేస్తూ ధోని ఆడే ఆ తరహా షాట్ కు హెలికాప్టర్ షాట్ అని పేరు పెట్టింది. ఇక అప్పట్నుంచి అది ప్రాచుర్యంలోకి వచ్చింది.
నిజానికి హెలికాప్టర్ షాట్ ను సృష్టించింది ధోని కాదు. ధోని అంతర్జాతీయ క్రికెట్ లోకి రాకముందు అతనితో కలిసి క్రికెట్ ఆడిన సంతోష్ లాల్ అలా ఆడేవాడు. అతడు జార్ఖండ్, బీహార్ తరఫున 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అతడు ఆడటం చూసే ధోని హెలికాప్టర్ షాట్ నేర్చుకున్నాడు. కాగా సంతోష్ లాల్ 2013లో అనారోగ్యంతో చనిపోయాడు. అతడి ఆరోగ్యం విషయం తెలిసి ధోని అతన్ని సంతోషాన్ని కాపాడేందుకు ఢిల్లీకి పంపేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే అతడు చనిపోయాడు.భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్ మహమ్మద్ షెహజాద్ ధోనిలా హెలికాప్టర్ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. గల్లీ కుర్రాళ్ళు కూడా ఆ షాట్ ఆడడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు.