సుప్రీం తీర్పునాడే గర్భవతికి ట్రిపుల్ తలాఖ్!
ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించేలా ఉన్న ట్రిపుల్ తలాఖ్ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే యూపీలోని ఓ వ్యక్తి భార్యకు తలాఖ్ చెప్పాడు. గర్భవతి అని కూడా చూడకుండా తలాఖ్ పేరుతో విడాకులు ఇచ్చిపారేశాడు. సర్వోన్నత న్యాయస్థానం తలాఖ్ చెల్లదని తీర్పునిచ్చిన నేపథ్యంలో భర్తపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు యూపీలోని మూహల్లా కమ్రా నవాబన్ ప్రాంతానికి చెందినది.
బాధిత మహిళకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లల తల్లయిన ఆమె ఇప్పుడు గర్భిణి! వారిద్దరి మధ్య ఉన్న గొడవలకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు అల్లుడి తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. అల్లుడికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆయన తీరుపై అత్తింటివారు తీవ్ర ఆవేదన చెందారు. ఇవేవీ పట్టించుకోని అతడు భార్యకు మూడుసార్లు తలాఖ్ చెప్పాడు. దీంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కట్నంకోసం చిత్రహింసలు పెట్టేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తలాఖ్ తప్పు అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పినా అతడు వినిపించుకోలేదని బాధితురాలు వాపోయింది. కాగా భర్త, అతని బంధువులు ఆరుగురిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధర్మేంద్ర సింగ్ చెప్పారు.
మరోవైపు ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) తన భవిష్యత్తు కార్యాచరణను భోపాల్ లో సెప్టెంబర్ 10న రూపొందించుకోనుంది. ఇంతకు ముందే బోర్డు కార్యవర్గ సమావేశం నిర్ణయించినప్పటికీ అజెండాను మాత్రం తీర్పు అనంతరం విడుదల చేసినట్లు బోర్డు కార్యవర్గ సభ్యుడు జఫర్యాబ్ జిలానీ చెప్పారు. ‘సెప్టెంబర్ 10న భోపాల్ లో జరిగే కార్యవర్గ సమావేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లోతుగా అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకొంటుంది’ అని ఆయన చెప్పారు. సమావేశంలో మిగతా అంశాలను కూడా చర్చించనున్నప్పటికీ ట్రిపుల్ తలాఖ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ప్రధాన అంశంగా ఉంటుందని సీనియర్ న్యాయవాది కూడా అయిన జిలానీ చెప్పారు. బాబ్రీ మసీదుపై సుప్రీం కోర్టు విచారణ కూడా భోపాల్ సమావేశం అజెండాలో ఉందని ఆయన చెప్పారు.