పురాణాల్లోనూ భూత‌ల స్వ‌ర్గం క‌శ్మీర్ చ‌రిత్ర చాలా ఉందే...

Update: 2019-08-05 16:03 GMT
మ‌న భూత‌ల స్వ‌ర్గంగా జ‌మ్మూ క‌శ్మీర్‌ ను పిలుస్తారు. మ‌నం ఎంతో అంద‌మైన పేరుతో పిలుచుకునే క‌శ్మీర్‌ కు చాలా చ‌రిత్రే ఉంది. విచిత్రం ఏంటంటే ఏడు ద‌శాబ్దాలు పాటు మ‌న‌దేశంలోనే ఉంటూ ఎంతో స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగి ఉన్న క‌శ్మీర్ నేడు శ్ర‌వాణ శుద్ధ పంచ‌యి కశ్యప మహర్షి జయంతి రోజే ఆ ప్ర‌తిప‌త్తి కోల్పోయింది. క‌శ్య‌ప మ‌హ‌ర్షి పేరుమీదుగా ఈ క‌శ్మీర్ ఏర్ప‌డింది.  ఇప్ప‌ట‌కీ క‌శ్మీర్‌ లోని అనేక న‌గ‌రాలు, ప్ర‌దేశాల పేర్లు మ‌న హిందూ పురాణాల‌ను బేస్ చేసుకునే ఉంటాయి. క‌శ్మీర్ అస‌లు మూల నామ‌ము శార‌దాదేశ‌ము. ఎంతో హిందూ సంస్కృతితో విరాజిల్లే క‌శ్మీర్‌ కు చిట్ట‌చివ‌రి రాజు కూడా మ‌హారాజా హ‌రిసింగ్‌. అత‌డు కూడా హిందువే. అత‌డు దేశ విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు క‌శ్మీర్‌ ను భార‌త్‌ లో విలీనం చేశారు.

ఆ కృత‌జ్ఞ‌త‌తో నెహ్రూ కొన్ని ప్ర‌త్యేక సౌల‌భ్యాలు ఇవ్వగా ఇప్పుడు అవి దేశ స‌మ‌గ్ర‌త‌కు ముప్పువాటిల్లేవిగా మారిపోయాయి. ఎట్ట‌కేల‌కు తాజా స‌వ‌ర‌ణ‌లో వాటికి చెక్ ప‌డిన‌ట్ల‌య్యింది. ఇక భూతల స్వర్గంగా పేరున్న‌ కశ్మీరు ప్రపంచంలోనే ఎక్కడాలేని ప్రత్యేకతను కలిగి ఉంది. ఎత్తయిన కొండలు, కోనలు, నదులు, అడవులు క‌శ్మీర్‌ సొంతం. ఇక్కడ ఉన్న విలక్షణమైన శీతోష్ణస్థితి ప్రపంచంలో మరెక్కడా ఉండదు. తాజాగా ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిపోయిన కశ్మీర్ ఇప్పుడు నిజమైన భూతల స్వర్గంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం క‌శ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న భార‌తీయులు ఎవరైనా ఇక్కడికి రావచ్చు... నివసించవచ్చు... భూములు కొనుగోలు చేసుకోవచ్చు... శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేని జీవనాన్ని క‌శ్మీర్లో కొనసాగించవచ్చు. ఇప్పటివరకు ఉన్న ఆర్టికల్ 370 ప్రకారం భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కశ్మీర్ లో భూములు కొనేందుకు అమ్మేందుకు అనర్హులు. ఇప్ప‌టి నుంచి అవేవి ఇక్క‌డ వ‌ర్తించ‌వు. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న రాజ్యాంగ‌మే ఇక్క‌డ కూడా అమ‌ల్లో ఉంటుంది.

ఇక క‌శ్మీర్ పండిట్లు ఇప్ప‌టి వ‌ర‌కు భూములు కొనేందుకు, అమ్మేందుకు అన‌ర్హులు. తాజా నిర్ణ‌యంతో వారంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ పుట్టిన వారికి మాత్ర‌మే భూములు అమ్మే, కొనుగోలు హ‌క్కు ఉండ‌గా ఇప్పుడు అది ర‌ద్ద‌య్యింది. తాజా నిర్ణ‌యంతో క‌శ్మీర్‌ లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పుంజుకుంటుంద‌ని.... అక్క‌డ రోజువారి జీవ‌న విధానంలో సంచ‌ల‌న‌మైన మార్పులు చోటు చేసుకోనున్నాయ‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు.

ఇక్క‌డ తాజా నిర్ణ‌యంతో బ‌హుల జాతిసంస్థ‌లు భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు అప్పుడే రెడీ అవుతున్నాయి. ప‌ర్యాట‌క రంగంలో క‌శ్మీర్ కొత్త శోభ‌ను సంత‌రించుకోనుంది. భూతల స్వర్గంగా పేరున్న జమ్మూ క‌శ్మీర్ కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. తాజా నిర్ణ‌యంతో ఈ రంగంలో భారీ పెట్టుబ‌డులు ఊపందుకోనున్నాయి. ప‌ర్యాట‌క రంగం ప్ర‌పంచానికే త‌ల‌మానికం అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటు అభివృద్ధి ఊపందుకుంటుంద‌ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.    
    
    

Tags:    

Similar News