మా ‘ఎమ్మెల్యే’కనబడుట లేదు.. వెతికిపెట్టండి ప్లీజ్!

Update: 2020-08-20 12:10 GMT
ఆయన తొడగొడితే రాయలసీమ దద్దరిల్లుతుంది. ఆయన డైలాగ్ చెబితే థియేటర్ మారుమోగిపోతుంది. సినిమాల్లో ఆయన డ్యాన్స్ చేస్తే స్టేజ్ షేక్ అవుతుంది. అంతటి మహానటుడు కం ఎమ్మెల్యే ఇప్పుడు సినిమాల్లో చెప్పిన నీతులు బయట పాటించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరా నేత అని అనుకుంటున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబుకు బామ్మర్ధి.. లోకేష్ పిల్లనిచ్చిన మామ నందమూరి రాజకీయ వారసుడు.. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ పవర్ ఫుల్ డైలాగులు పేల్చే సినిమా హీరో కం ఎమ్మెల్యే బాలక్రిష్ణ అలియాస్ బాలయ్య కనపడుట లేదని ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించిన హిందుపూర్ వాసులు మొత్తుకుంటున్నారు. రెండోసారి వరుసగా వైసీపీలో గాలిలోనూ గెలిపిస్తే కరోనా టైంలో అసలే అడ్రస్ లేకుండా పోయాడని మథనపడుతున్నారు. నియోజకవర్గంలోని ఆయన పీఏకి కాల్ చేసినా ఫోన్ ఎత్తడం లేదని హిందూపూర్ వాసులు మాత్రమే కాకుండా టీడీపీ లోకల్ నేతలు కూడా వాపోతున్నాయి..

2014 కంటే 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ బాలక్రిష్ణకు మంచి మెజారిటీ ఇచ్చి హిందూపురం ప్రజలు గెలిపించారు. అయినా మా ఎమ్మెల్యే బాలయ్య కనపడకుండా కనీసం పీఏ కూడా అందుబాటులో లేకుండా పోవడం కరెక్ట్ కాదు అని అక్కడ టీడీపీ వర్గాలే అంటున్నాయి..
 
సినిమాలో పెద్ద పెద్ద డైలాగులు చెప్తారని.. అదే పొలిటికల్ లో బాలయ్య నిరూపించుకోవడం లేదని.. మేము గెలిపిస్తే కరోనా టైంలో కష్టాలు వచ్చినా ఎమ్మెల్యేగా దగ్గర లేడని.. ఆదుకోవడం లేదని హిందూపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు పోతే మా ఎమ్మెల్యేను వెతికి పెట్టండని సోషల్ మీడియాలో పోస్టులు.. పోస్టర్లు పెట్టే పరిస్తితి వస్తుందేమోనని హిందూపురం జనాలు అంటున్నారు.
Tags:    

Similar News