జీవో 111, కోకాపేట భూముల వేలంపై హైకోర్టులో కీలక విచారణ
కోకాపేట భూముల వేలం, జీవో 111పై హైకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది. జీవో 111 రద్దు చేసే ఆలోచనలో ఉందా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో 111 రద్దు చేయనున్నట్లు సీఎం వెల్లడించారన్న పత్రికలో కథనాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.
జీవో 111 రద్దు చేసే ఆలోచనణ ఉంటే ఎందుకు చెప్పడం లేదని అదనపు ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. జీవో రద్దు చేసే ఆలోచనలో ఉంటే ఈ విచారణ అంతా ఎందుకని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సగం సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించవద్దని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జీవో రద్దు ఆలోచనపై వివరాలు తెలుసుకొని చెప్పాలని ఏఏజీకి ఆదేశించింది.
ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సెప్టెంబర్ 13లోగా ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలుపాలని ఈ కమిటీకి ఆదేశించింది. నివేదికను వెబ్ సైట్ లో పెట్టాలని కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సీఎం దగ్గర వివరాలు తెలుసుకొని చెబుతానని ఏఏజీ రామచంద్రరావు తెలుపడంతో జీవో 11పై విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు విచారణకు అధికారులను కూడా పిలిపించుకోవాలని హైకోర్టు సూచించింది.