హైదరాబాద్ లోని ఆ పబ్బులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించని ఒక అంశంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రియాక్టు కావటమే కాదు.. కీలక వ్యాఖ్యలు చేసి.. చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ ను నిర్వహిస్తూ ఉంటారు. మరి.. ఇదే డ్రంకెన్ డ్రైవ్ ను రహదారులమధ్యలో నిర్వహిస్తే.. భారీ ట్రాఫిక్ జాంను క్రియేట్ చేయటమే కాదు.. రాత్రిళ్లు తొందరగా ఇంటికి వెళ్లాలని ఆశించే వేలాది మందికి చుక్కలు చూపిస్తుంటారు పోలీసులు.
ఇదే విషయాన్ని ప్రస్తవిస్తే.. మీ మంచి కోసం మేం పని చేస్తే.. మా మీదే విమర్శలు చేస్తారా? అని ఎదురు ప్రశ్నిస్తారు. నిజమే.. వారు చెప్పే దాంట్లోనూ పాయింట్ ఉందని అనుకుంటే.. లాజిక్ ఒకటి తన్నుకుంటూ వస్తుంటుంది. అదేమంటే.. నిజంగానే మందుబాబుల్ని కంట్రోల్ చేయటమే హైదరాబాద్ పోలీసులు లక్ష్యమైతే.. వారు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ ను.. ఎక్కడైతే వైన్స్ ఎక్కువగా ఉంటాయో.. వాటికి నాలుగు వైపులా.. పబ్బులు.. బార్లు ఉంటాయో వాటికి కాస్త దూరంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తే.. ఎక్కువ దూరం ప్రయాణించకుండానే దొరికిపోతారు కదా? ఇంత చిన్న విషయాన్ని పోలీసులు ఎందుకు పాటించరు?
డ్రంకెన్ డ్రైవ్ ను నిర్వహించే పోలీసులు ఎప్పుడూ కూడా భారీ హాజరు ఉండే పబ్ లకు సమీపంలో కానీ.. బార్లకు దగ్గరగా ఎందుకు నిర్వహించరు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. అంతేకాదు.. రోడ్డు పక్కన ట్రాఫిక్ జాం అవుతుందని చెబుతూ.. వాహనాల్ని నిలిపిన వారిపై చలానాలు వేసే ట్రాఫిక్ పోలీసులు.. పబ్బుల దగ్గర రోడ్ల మీదనే భారీగా కార్లను నిలిపివేసే వాటిపై ఎప్పుడు ఎందుకు చలానాలు విధించరన్న ప్రశ్నకు సమాధానం లభించదు.
తాజాగా కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. అందులో భాగంగా అనూహ్యంగా కొన్ని కీలక అంశాల్ని ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబరు 36, 45లలో పబ్బుల వద్ద యువకులు గుమిగూడుతున్నారని.. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు నిఘా పెట్టి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేపట్టాలన్న వ్యాఖ్య చేశారు. హైదరాబాద్.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు చెందిన వారెవరూ చేయని పనిని.. హైకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో.. ఇప్పటికైనా తనిఖీలు నిర్వహిస్తారా? లేదా? అన్నది చూడాలి.