ఈసారికి హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం

Update: 2015-08-21 05:17 GMT
రానున్న వినాయకచవితి సందర్భంగా హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల్ని నిమజ్జనం చేయటాన్ని నిషేధించాల్సిందిగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పష్టమైన వ్యాఖ్య చేసింది. హుస్సేన్ సాగర్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై నిషేధాన్ని విధించలేమని తేల్చేసింది. దీంతో.. ఇప్పటివరకూ నిమజ్జనంపై ఉన్న కన్ఫ్యూజన్ తొలిగిపోయినట్లయింది.

ఎత్తైన విగ్రహాల తయారీని ఆపేందుకు చర్యలు తీసుకోలేమని చెప్పి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోస్లే.. జస్టిస్ భట్ లతో కూడిన బెంచ్ తాజా ఆదేశాల్ని జారీ చేసింది. రానున్న వినాయకచవితి సందర్భంగా విగ్రహాల తయారీ దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పింది. అదే సమయంలో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ఈసారికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటంతో నిమజ్జనంపై ఇప్పటివరకూ ఉన్న సందేహాలు తొలిగిపోయినట్లేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News