సీఎం జగన్ ఇంటి వద్ద హైఅలెర్టు.. కారణం ఏమిటి?

Update: 2021-06-19 03:18 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసం వద్ద హైఅలెర్టు ప్రకటించారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసుల్ని మొహరించారు. ఇంతకూ ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? అంతలా బందోబస్తు ఏర్పాటు చేయటానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

ఏపీ రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేయాలన్న డిమాండ్ తో అక్కడి రైతులు ఉద్యమాన్ని స్టార్ట్ చేయటం తెలిసిందే. ఇవాల్టికి (శనివారం) ఆ నిరసన 550 రోజులకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో నిరసన చేస్తున్న వారు  సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తారన్న ఆలోచనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

అంతేకాదు.. ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఎవరైనా కొత్త వారు కనిపించినా.. అనుమానాస్పదంగా వారి వైఖరి ఉన్నా.. వెంటనే వారిని పోలీసు అరెస్టు చేస్తారని చెబుతున్నారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారులన్ని మూసి వేయటంతో పాటు.. భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మొహరించారు.

అంతేకాదు.. ర్యాలీలు.. నిరసనలకు పోలీసులు అనుమతులు లేవని తేల్చి చెబుతున్నారు. పాలనను వికేంద్రీకరించటంలో భాగంగా ఏపీ రాజధానిని మూడుగా చేయాలన్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించినపనులు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు ఏపీ రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. 
Tags:    

Similar News