ఇక్కడ ముఖ్యమంత్రే సచివాలయానికి రారు.. అక్కడ మంత్రి రాకున్నా క్లాస్

Update: 2019-11-01 17:30 GMT
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వెళ్లి ఏళ్లు గడిచిపోయాయి. ఆ విషయం జనం మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం తాను నిత్యం సచివాలయానికి వస్తుండడమే కాదు మంత్రులు సచివాలయంలో కనిపించకపోతే పిలిచి క్లాస్ పీకుతున్నారట. ప్రజలు నిత్యం సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వస్తుంటే మీరు ఎందుకు రావడం లేదంటూ ఆయన ఇటీవల పలువురు మంత్రులపై ఆగ్రహించారు.

కనీసం వారంలో రెండురోజులయినా  సంబంధిత శాఖ అధికారులకు, ప్రజలకు మంత్రులు సచివాలయంలో అందుబాటులో వుండకుంటే ఎలాగంటూ సచివాలయానికి నిత్యం డుమ్మా కొడుతున్న మంత్రులపై జగన్ ఫైర్ అయ్యారు.  బుధవారం కేబినెట్  బేటీ అనంతరం మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత  రాజకీయ పరిణామాలపై వారితో చర్చించడంతో పాటు కొందరు మంత్రుల తీరుపైనా ఆయన క్లాస్ పీకారట.

ప్రతిపక్ష పార్టీలు తమ పద్దతి మార్చుకోకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారికి సరైన సమాధానం ఇచ్చే బాధ్యత ప్రభుత్వంలోని వ్యక్తులుగా మంత్రులపైనే వుందని....వారు పొలిటికల్ కామెంట్లు మరింత అటాకింగ్ గా ఉండాలని సూచించారు. అదేసమయంలో కొందరు మంత్రులు సచివాలయానికి రాకపోవడంపై సీరియస్ అయ్యారు. మంగళ, బుధవారాల్లో మంత్రులు సెక్రటేరియట్ కు రావాలని జగన్ సూచించారు.
Tags:    

Similar News