• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముంబైలో భారీ వర్షాలు.. 22...

ముంబైలో భారీ వర్షాలు.. 22 మంది మృతి

By - Tupaki Desk
Update: 2021-07-18 11:00 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. ఈ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో భారీ వర్షాలు వరదల వల్ల వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మృతి చెందడం విషాదం నింపింది.

విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్స్ పై నీరు నిలిచిపోవడంతో పలు లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ముంబైలోని ప్రముఖ ప్రాంతాల్లో, గాంధీ మార్కెట్ ఏరియాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీరు నిలిచిపోయింది. ఇక షణ్ముక్ నందా రోడ్డుసైతం మునిగిపోయింది.

సియాన్ రైల్వేస్టేషన్ మొత్తం వరద ఉధృతిలో చిక్కుకుపోయింది. వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముంబైలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు రహదారులపై నిలవడంతో హైవేలపై పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. బోరివాలి ఈస్ట్ ఏరియా ప్రాంతంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తడంతో ఆదివారం మహుల్ ప్రాంతంలో గోడ కూలిపోయి కొందరు.. కొండచరియలు విరిగిపడి ఇళ్లపై పడడంతో మరికొందరు.. కాంపౌండ్ గోడకూలి మొత్తం 15మంది మరణించారు.

ఇక మహారాష్ట్రను వానలు వదిలేలా లేవు. ముంబై, ఠానేతోసహా  పలు జిల్లాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ముంబై సముద్ర తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఏజెన్సీలు, రెస్క్యూ టీం అందుబాటులో ఉండాలని సీఎం ఉద్దవ్ ఆదేశాలు జారీ చేశారు.

ముంబైలోనీ నీటిసరఫరా ఆగిపోయింది. వీటిని యుద్ధప్రాతిపదికన పునరుద్దరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాగునీటిని వేడి చేసి తాగాలని నగరవాసులకు ప్రభుత్వం సూచించింది.
Tags:    
  • Mumbai Rains 
  • 22 killed in mumbai 
  • 22 dead several injured in Mumbai 
  • Heavy Rains In Mumbai 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS