కరోనాతో గుండెకు చేటు.. ఇలా అనర్థాలు
కరోనా కల్లోలం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఆ మహమ్మారి ధాటికి జనం పిట్టల్లా రాలిపోయారు. అమెరికా, యూరప్ లలో అయితే మరణ మృదంగం వినిపించింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2021లో అమెరికాలో గుండె జబ్బులు.. క్యాన్సర్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది కరోనా వల్లే.. కోవిడ్-19 మరణాలు అమెరికాలో ఆ రెండింటి తర్వాత 3వ స్థానంలో ఉన్నాయి. అయితే కరోనా కారణంగా గుండెకు చేటు అని తాజా పరిశోధనలో తేలింది.
కరోనా.. దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని లాక్ డౌన్ పాలు చేసిన ఈ మహమ్మారికి అందరూ వణికిపోయారు. కేవలం ఊపిరితిత్తులకు పట్టి చంపేయడమే కాదు.. ఈ రోగం వస్తే ఎన్నో సైడ్ ఎఫెక్ట్ లకు గురై ప్రాణాలు పోతున్నారు. ఎస్పీ బాలు, కృష్ణంరాజు లాంటి వారు కరోనా జయించినా దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్ ల వల్లే అవయవాలు దెబ్బతిని మరణించారు. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వల్ల తాజాగా కొందరిలో గుండె దెబ్బతింటుందని ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.
కోవిడ్, ఇన్ ఫ్లూయెంజాలు తీవ్రస్థాయిలో శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లను కలిగించే వైరస్ లను విడుదల చేస్తాయి. ఈ వైరస్ ల వల్ల గుండె కణజాలంపై కూడా ప్రభావం చూపుతుందని తేలింది. వాటి తీరు భిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తమ పరిశీలనల్లో కోవిడ్ బాధితుల గుండె కణజాలాల్లో వైరస్ రేణువులు కనిపించలేదని తేల్చారు.
డీఎన్ఏ దెబ్బతినడం.. మరమ్మతులకు సంబంధించిన మార్పులు మాత్రం అక్కడ దర్శనమిచ్చాయన్నారు. ఈ రెండు పరిణామాలు జన్యుపరమైన అస్థిరతకు దారితీస్తాయని వివరించారు. మధుమేహం, క్యాన్సర్, రక్తనాళాల గోడలు గట్టిపడడం.. నాడీ క్షీణత వ్యాధులతో దీనికి సంబంధం ఉందన్నారు. ఇన్ ఫ్లూయెంజా వల్ల గుండె కణాజాలాల్లో మితిమీరిన ఇన్ ఫ్లమేషన్ జాడ కనిపించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు దాపురిస్తున్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులున్న వారికి ఇది మరింత ముప్పుగా మారిందట.. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి అతి చురుకైన రోగనిరోధక ప్రతిస్పందన కారణంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. పరిశోధకుల నేతృత్వంలోని ఈ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. కోలుకున్న తర్వాత కోవిడ్ -19 రోగుల్లో దెబ్బతిన్న రక్తనాళాల గోడల నుండి చిందించిన ఎండోథెలియల్ కణాల (సిఇసి) సంఖ్య సాధారణ సంఖ్య కంటే రెండింతలు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత రక్తనాళాల గాయం ఇంకా స్పష్టంగా కనబడుతుందని సిఇసిల స్థాయిలు సూచిస్తున్నాయి.
కోలుకున్న కోవిడ్ -19 రోగులు అధికస్థాయిలో సైటోకిన్‌లను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. రోగనిరోధక కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రోటీన్లు, వ్యాధికారక కారకాలకు వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తోందని తేలింది. కోలుకున్న కోవిడ్ -19 రోగుల రక్తంలో వైరస్ లపై దాడి చేసి నాశనం చేసే టి కణాలు అసాధారణంగా అధిక సంఖ్యలో ఉన్నాయని అధ్యయనంలో తేలింది. సైటోకిన్లు.. అధిక స్థాయి రోగనిరోధక కణాలు ఉండటం ద్వారా కోలుకున్న కోవిడ్ -19 రోగుల్లో రోగనిరోధక వ్యవస్థ వైరస్ పోయినా రక్తం గడ్డకట్టేలా ప్రేరేపిస్తోందని తేలింది.
నిరంతరం ప్రేరేపిస్తున్న ఈ రోగనిరోధక ప్రతిస్పందనలు కోలుకున్న కోవిడ్ -19 రోగుల రక్తనాళాలపై దాడి చేస్తాయని, మరింత నష్టం కలిగిస్తుందని మరియు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని మరింత పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. "కోవిడ్ -19 ప్రధానంగా శ్వాసకోశాలపై దాడి చేస్తుంది. వైరస్ రక్తనాళాల లైనింగ్‌పై దాడి చేసి, మంటతోపాటు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ దెబ్బతిన్న నాళాల నుండి లీకేజ్ రక్తం గడ్డకట్టడాన్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల రోగులలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి." పరిశోధకులు చెప్పారు. డయాబెటిస్, గుండెకు సంబంధించిన వారికి దగ్గరగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది" అని వివరించారు. ఈ బృందం 30 మంది కోవిడ్ -19 రోగుల నుండి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించింది. దీనివల్ల గుండెపోటులు వచ్చి.. సడెన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని.. కరోనాతో గుండెకు కూడా చేటు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.