జైలుకు పంపిందన్న కోపంతో గొడ్డలితో నరికాడు

Update: 2021-02-03 05:38 GMT
హైదరాబాద్ మహానగర శివారులో దారుణం చోటు చేసుకుంది. చేసిన ఎదవ పనికి బాధ పడటం.. చేసిన తప్పును తెలుసుకొని బుద్దిగా ఉండటం పోయి.. అందుకు భిన్నంగా వ్యహరించిన ఒక దుర్మార్గుడి ఉదంతం షాకింగ్ గా మారింది. ఒక మహిళను లైంగికంగా వేధించిన కేసులో జైలుకు వెళ్లిన సదరు వ్యక్తి.. బయటకు వచ్చిన  తర్వాత.. తాను జైలుకు వెళ్లటానికి కారణమైన మహిళపై కోపాన్ని పెంచుకున్నాడు. కక్ష్యతో తాజాగా గొడ్డలితో దాడి చేసి దారుణంగా గాయపర్చిన వైనం సంచలనంగా మారింది.

గుర్రంగూడలోని టీచర్స్ కాలనీలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. రాహుల్ గౌడ్ అనే వ్యక్తి ఒక మహిళను తరచూ లైంగికంగా వేధించేవాడు. దీంతో.. అతడిపై కంప్లైంట్ చేసింది. దీంతో.. అతడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద పోలీసు కేసు నమోదు చేశారు. కోర్టు అతడికి శిక్ష విధించింది. జైలుకు వెళ్లిన రాహుల్ తాజాగా బయటకు వచ్చాడు. తనను జైలుకు పంపిన మహిళపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలా అయినా చంపాలని నిర్ణయించాడు.

తాజాగా ఆమె ఇంటికి వెళ్లి.. తలుపు కొట్టగా.. ఆమె తలుపు తీసింది. అంతే.. విచక్షణ మరిచిన రాహుల్.. ఆమెపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో పెద్దగా అరిచిన ఆమె అరుపులకు చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న ఆమె గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసు కేసు నమోదు చేసిన పోలీసులు.. రాహుల్ గౌడ్ కోసం పెద్ద ఎత్తున గాలింపులు జరుపుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News