కొత్త సీఈసీ ఆయనే.. అధికారిక ఉత్తర్వులు ఏ క్షణంలో అయినా..

Update: 2021-04-12 04:17 GMT
కొత్త సీఈసీ రానున్నారు. ఇప్పటివరకు ఆ బాధ్యతను నిర్వహించిన సునీల్ అరోడా పదవీ కాలం ఈ నెల 12తో (అంటే.. ఈ రోజుతో) ముగియనుంది. దీంతో.. ఆయన స్థానంలో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ఉత్తర్వు విడుదల కానుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుశీల్ చంద్ర నియమితులవుతారని చెబుతున్నారు.

ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం ప్రకారం ఎన్నికల కమిషనర్ గా ఉన్న ముగ్గురిలో.. ఎవరైతే సీనియర్ గా ఉంటారో వారిని.. ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉంటారు. ఇదో అనవాయితీగా ఉంది. దీనికి తగ్గట్లే.. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న సునీల్ చంద్రను సీఈసీగా ఎంపిక చేయటానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

దీంతో.. ఆయన్ను సీఈసీగా ఎంపిక చేస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు ఏ క్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అరోడా నుంచి పదవీ బాధ్యతల్నిసునీల్ రేపు (ఏప్రిల్ 13న) చేపడతారు. ఆయనీ పదవిలో వచ్చే ఏడాది మే 14వరకు ఉండనున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టటానికి ముందు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలికి ఛైర్మన్ గా ఉన్నారు. సునీల్ చంద్ర నేత్రత్వంలోనే గోవా.. మణిపూర్.. ఉత్తరాఖండ్.. పంబాజ్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి.
Tags:    

Similar News