హాథ్రస్ నిందితుల తరఫు లాయర్ అతగాడేనట
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నిర్భయ ఉదంతంలో దోషులుగా తేలిన వారికి కోర్టు విధించిన ఉరి తీయటానికి ఎన్ని తిప్పలు ఎదురయ్యాయో తెలిసిన సంగతే. కోర్టుల సహనానికి పరీక్ష పెట్టి.. ఏ చిన్న అవకాశాన్ని వదలని వారి తరఫు న్యాయవాది అజయ్ ప్రకాశ్ సింగ్ పై చాలామంది గుస్సా అయ్యారు. మానవత్వం లేని మానవ మృగాలను రక్షించేందుకు ఆయన వ్యవహరించిన తీరును చాలామంది తప్పు పట్టారు. అందుకు ఆయన మాత్రం భిన్నంగా రియాక్టు అవుతారు. తన క్లయింట్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనకుందని.. చట్టంలోని అన్ని అంశాల్ని వాడుకోవటం తప్పేమీ కాదన్నట్లుగా వ్యవహరించే ఆయన.. తాజాగే పెను వివాదంగా మారిన హాధ్రస్ ఉదంతంలోనూ.. నిందితుల తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు.
యూపీలోని ఒక దళిత బాలికపై జరిగిన హత్యాచారానికి పాల్పడిన వారి తరఫున వకల్తా పుచ్చుకునేందుకు ఓకే చెప్పేయటం ద్వారా ప్రకాశ్ సింగ్ మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. నలుగురు నిందితుల్నిరక్షించేందుకు ఆయన రంగంలోకి దిగారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన తమ తరఫున కేసును వాదించనున్నట్లుగా అఖిల భారతీయ క్షత్రియ మహాసభ ఒక ప్రకటనను విడుదల చేసింది.
హాథ్రస్ ఉదంతంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు యువకుల తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తారని.. తమ వినతిని మన్నించి అమాయకులైన ఠాకూర్ యువకులను రక్షించేందుకు ముందుకు వచ్చిన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తమ వర్గానికి చెందిన యువకులను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందుకే వారిని కాపాడేందుకు తాము నడుం బిగించినట్లు సదరు సంస్థ చెబుతోంది. ఈ కేసుకు అవసరమైన నిధుల్ని చందాల రూపంలో సేకరిస్తామని వారు చెబుతున్నారు.
నిర్భయ కేసులో బాధితురాలి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ.. హాథ్రస్ ఉదంతంలోనూ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ కేసును టేకప్ చేసిన సంగతి తెలిసిందే. నిర్భయ కేసును గుర్తుకు తెచ్చే ఈ వ్యవహారంలో న్యాయపోరాటం ఎలా ఉంటుందన్నది రానున్న రోజులు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.