• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ అమెరిక‌న్లను...

ట్రంప్ అమెరిక‌న్లను బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారా?

By - Tupaki Desk
Update: 2019-01-06 07:02 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంత కాలం త‌న విధానాల‌తో...సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో విదేశీయుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, ఇరకాటంలో ప‌డేయ‌గా ఇప్పుడు ఏకంగా అమెరికన్ల‌ను ఆందోళ‌నకు గురుచేస్తున్నారా? మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు నిధులు ఎపిసోడ్ పేరుతో అగ్ర‌రాజ్యం దిశ‌ను ప్ర‌భావితం చేసే నిర్ణ‌యం తీసుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో.

మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు నిధుల కేటాయింపు వివాదం మూలంగానే అమెరికాలో ప్రభుత్వ పాలన రెండు వారాలుగా స్తంభించిపోయింది.  గోడ నిర్మాణానికి ట్రంప్ 560 కోట్ల డాలర్లు కోరుతుండగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు ససేమిరా అంటున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభనను తొలిగించేందుకు ట్రంప్ శుక్రవారం సాయంత్రం డెమోక్రాట్ సభ్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో చట్టసభ అనుమతి లేకుండా మెక్సికో సరిహద్దులో గోడ కట్టేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తానని సభ్యులను హెచ్చరించినట్టు ట్రంప్ విలేకరులకు తెలిపారు. నిధులివ్వకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ చట్టసభ సభ్యులను బెదిరించారు.  తన మాట నెగ్గించుకొనేందుకు అవసరమైతే నెలలు కాదు ఏండ్లయినా సరే ప్రభుత్వాన్ని మూసివేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు.

అంతకుముందు సెనేట్‌ లో మైనారిటీల నాయకుడు చక్ షూమర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని పనిచేయించాల్సిందిగా కోరామన్నారు. ఇంకా అనేక విషయాలు చర్చించామని, వాటిలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయని, చర్చలు కొనసాగుతాయని చెప్పారు. అయితే ప్రభుత్వం పనిచేయనంత వరకు చర్చలు పురోగతి సాధించడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ, డెమోక్రాట్ల ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకున్నామని, అయితే ప్రభుత్వం పనిచేయకుండా ఏదీ పరిష్కారం కాదని అన్నారు. అమెరికన్ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని మూసివేసైనా తాను పనిచేయగలనని త‌న మొండి త‌నాన్ని చాటుకున్నారు.




Full View
Tags:    
  • Donald Trump 
  • US President 
  • telugu News 
  • US Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS