సిరీస్ కోసం పెళ్లి పోస్ట్ ఫోన్?

Update: 2015-09-13 04:17 GMT
భజ్జీగా సుపరిచితుడైన హర్భజన్ సింగ్ మరికొంత కాలం బ్యాచ్ లర్ గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్నబాలీవుడ్ భామ గీతాబస్రాతో పెళ్లిముడి పడేందుకు నవంబరు 29న ముహుర్తంగా నిర్ణయించినట్లు చెప్పినప్పటికి అది సాధ్యమయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.

ఇప్పటివరకూ వచ్చిన పెళ్లి వార్తల్లో నిజం లేదని హర్భజన్ ఖండిస్తున్నాడు. ప్రేమపక్షులుగా సుపరిచితులైన ఈ జంట పెళ్లి పోస్ట్ పోన్ కి కారణంగా కెరీర్ అన్న మాట వినిపిస్తోంది.  సౌత్ అఫ్రికా సిరీస్ కు భజ్జీ ఎంపికయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. పెళ్లికి సీరిస్ అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే.. సిరీస్ కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.

సిరీస్ పూర్తి అయిన తర్వాత.. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది మొదట్లో భజ్జీ ఇంట పెళ్లిబాజాలు మోగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి భజ్జీ పెళ్లికి సిరీస్ అడ్డంకిగా మారిందన్న మాట వినిపిస్తోంది. పెళ్లి ఆలస్యమైనా.. ప్రేమపక్షుల విహారానికి అడ్డుకునే వారెవరూ లేరుగా.
Tags:    

Similar News