తెలంగాణలో మళ్లీ హ్యాకింగ్ ప్రకంపనలు
తెలంగాణలో హ్యాకింగ్ ప్రకంపనలు ఇప్పటివీ కావు.. ఏపీ, తెలంగాణ విభజన సమయంలోనే అవి సంచలనమయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో ‘ఓటుకు నోటు’ కేసుతో ఈ అలజడి చెలరేగింది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులు ఎరచూపి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టాడు. ఇది వీడియోలకు చిక్కింది. ఈ వ్యవహారం అంతా నడిపించింది చంద్రబాబేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో విడుదలై కలకలం రేపింది. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కొన్ని ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు విడుదల చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా వినిపించింది. దీనిపై చంద్రబాబు నాడే నా ఫోన్ ట్యాప్ చేస్తారా? అని కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టించారు. పోలీసుల చేత నోటీసులు కూడా పంపారు. ఆ కేసు తర్వాత ఏమైందో తెలియదు కానీ కేసీఆర్, చంద్రబాబులు కలిసి పోయి స్తబ్దుగా మారిపోయింది.
తెలంగాణలో మళ్లీ హ్యాకింగ్ ప్రకంపనలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మేరకు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు.
ఈ విషయంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్దధంగా పోస్టింగ్ దక్కించుకున్న ఆయన ఈ పనిచేశారన్నారు. ఆయనపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు.
డీజిల్ , పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ సూచనతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి లేవనెత్తిన ఈ ట్యాపింగ్ ఆరోపణలు కేసీఆర్ సర్కార్ ను మళ్లీ డిఫెన్స్ లో పడేశాయి. ఇప్పటికే తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందని.. వారి కనుసన్నల్లోనే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే తేనెతుట్టెను కదిలించారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం రాజకీయంగా అలజడి రేపుతోంది.
నాడు పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు ఫోన్లు ట్యాప్ చేసిన వ్యవహారం సద్దుమణిగినా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని.. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలవి కూడా చేస్తున్నారనడంతో సంచలనమైంది. ఇప్పటికే బండి సంజయ్ దూకుడుగా వెళుతున్నారు. ఆయన కూడా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంటే కేసీఆర్ సర్కార్ కు చిక్కులు తప్పవు. ఇప్పటికే టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.ఆ తర్వాతనే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆస్తులపై తెలంగాణ సర్కార్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను బీజేపీకి కూడా అంటించి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్ సర్కార్ ను డిఫెన్స్ లో పడేశాడన్న చర్చ సాగుతోంది. మరి ముందుముందు ఈ వ్యవహారం ఎలాంటి రాజకీయ రంగు పులుముకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.