హ్యాకర్ల పంజా.. ట్రంప్ డబ్బులు కొట్టేశారు

Update: 2020-10-30 17:30 GMT
అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం. ఆపై విరాళాల వెల్లువ. నిధులు వెల్లువలా వచ్చాయి. ఇలాంటి సమయంలో హ్యాకర్లు గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా ట్రంప్ బ్యాంక్ అకౌంట్లకే ఎసరు పెట్టారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హ్యాకర్లు పంజా విసిరారు. ఏకంగా అమెరికాలో అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్లోకి చొరబడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీఎలక్షన్ కోసం సేకరించిన నిధులను గుట్టుగా కాజేయడం సంచలనమైంది.

ఏకంగా అధ్యక్షుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేయడం సంచలనమైంది. వెంటనే ఎఫ్బీఐ కు ఫిర్యాదు చేసి రిపబ్లికన్ పార్టీ విచారణ మొదలు పెట్టింది.

ట్రంప్ ఎన్నికల ఖర్చు కోసం ఈసారి రిపబ్లికన్ పార్టీ నేతలు భారీగా విరాళాలు సేకరించారు. ఈ డబ్బును విస్కాన్సిస్ రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్‌లో జమచేశారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు తాజాగా రిపబ్లికన్ పార్టీ అకౌంట్ ను హ్యాక్ చేసి అందులో జమ చేసిన డబ్బును దొంగలించారు. సుమారు 2.3 మిలియన్ డాలర్లను హ్యాకర్లు కాజేశారని.. అక్టోబర్ 22న అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది.
Tags:    

Similar News