బరస్ట్ అయిన గుత్త జ్వాల.. సోషల్ మీడియా ఘాటు పోస్టు

Update: 2021-02-14 00:30 GMT
గుత్తా జ్వాల బరస్ట్ అయిపోయింది. తన పోస్టుపై అభ్యంతరకర కామెంట్ చేసి నెటిజన్ గూబ గుయ్యిమనేలా విరుచుకుపడింది. అసలు మనం ఎటు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ సమాజానికి ఏమైందని ఆవేదన చెందింది
గుత్తా జ్వాల తల్లిది చైనానే.. హైదరాబాద్ వచ్చి ఇండియన్ ను చేసుకుందామె. ప్రస్తుతం హైదరాబాద్ లోనే గుత్తా జ్వాల ఫ్యామిలీ ఉంటోంది. అయితే గుత్తా జ్వాల అమ్మమ్మ మాత్రం చైనాలోనే ఉంటోంది.ఇటీవల గుత్తా జ్వాల అమ్మమ్మ మృతి చెందింది. అమ్మమ్మకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలను గుత్తా జ్వాల షేర్ చేసింది. తన ఆవేదనను పంచుకుంది.

అయితే గుత్తా నివాళులపై ఓ నెటిజన్ స్పందించారు. 'కోవిడా లేక చైనీస్ వైరసా?' అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ స్క్రీన్ షాట్ ను గుత్తా జ్వాల అభిమానులతో పంచుకుంటూ మనం ఎటు పోతున్నామని ఆమె ఆవేదనతో ప్రశ్నించింది. గుత్తా ట్వీట్ వైరల్ అయ్యింది.

చైనాలో ఉంటున్న అమ్మమ్మ ఇటీవలే చనిపోతే కరోనా లాక్ డౌన్ తో మాకు ఆమెను చూసే అవకాశం కూడా లేకపోయింది. గత ఏడాదిగా చైనాకు వెళ్లే అవకాశం లేకపోయిందని.. మనకిష్టమైన వారికోసం వీలున్నప్పుడే.. ఏది చేయాలనిపిస్తే అది చేయాలనే ముఖ్యమైన విషయాన్ని ఈ వైరస్ మనకు తెలియజేసిందని గుత్తా జ్వాలా వాపోయింది..

అమ్మమ్మ చనిపోయిన బాధలో తానుంటే చైనా వాళ్లమని దెప్పిపొడిచిన నెటిజన్ కామెంట్ పై బాధపడింది. మన సమాజానాకి ఏమైంది.. సానుభూతి ఎక్కడుంది అని గుత్వా జ్వాల సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు మద్దతుగా కొందరు కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News