• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో పాల‌న బాలేదు.....

ఏపీలో పాల‌న బాలేదు.. జ‌న‌సేన‌లో చేర‌తా: మంత్రి బొత్స కీల‌క అనుచ‌రుడి ప్ర‌క‌ట‌న‌

By - Tupaki Desk
Update: 2022-11-22 03:48 GMT
ఏపీలో కీల‌క మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కీల‌క అనుచ‌రుడిగా పేరున్న విజ‌య‌న‌గ‌రం జిల్లా వైసీపీ నాయ‌కుడు, ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌ గురాన అయ్య‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం, త‌ర్వాత కాంగ్రెస్‌లో ఉన్న ఈయ‌న త‌ర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కొన్నాళ్లుగా బొత్స‌కు దూరంగా ఉంటున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయ‌న తాజాగా ఏపీ ప్ర‌బుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాను త్వ‌ర‌లోనే జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు.

జ‌న‌సేనాని పవన్ కల్యాణ్తో కలసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నానని  గురాన అయ్యలు తెలిపారు. ఈ నెల19న హైదరాబాద్లో పవన్ను మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు.

సుపరిపాలన అందించే ఆయన నాయకత్వాన్ని అందరూ బలపరిచే సమయం ఆసన్నమైందన్నారు.  త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఆ పార్టీలో చేరుతానని గురాన అయ్యలు తెలిపారు. తాను స్వతహాగా మెగా ఫ్యామిలీకి అభిమానినని, గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసినట్లు తెలిపారు.

ఏపీలో అన్యాయమైన, స్వార్థపూరిత రాజకీయ పాలనావ్యవస్థను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ పోరాటస్ఫూర్తి, అందరికీ సమన్యాయం, మంచి చేయాలనుకునే పవన్ నాయకత్వం నచ్చిందని తెలిపారు.

పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని అందరూ బలపరిచే సమయం ఆసన్నమైందని అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసినవారు, వివిధ పార్టీల్లో కష్టపడినా గుర్తింపు లేనివారు జనసేన పార్టీలో చేరి మద్దతు ఇవ్వాలని కోరారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • MinisterBotsaSatyanarayana 
  • YSRCPLeader 
  • GuranaAyyalu 
  • APGovernment 
  • JanasenaParty 
  • YSRCPGovernment 
  • APPolitics 
  • PawanKalyan 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS