ఒక్క మార్క్ పాస్: వైరలవుతున్న ఐఏఎస్ ట్వీట్
ప్రతిదీ విలువైనదే.. చివరకు సున్నా కూడా ఎంతో విలువైనది. ఒంటరిగా సున్నాకు ఏం విలువ లేదు.. కానీ దానికి ముందు ఏదైనా అంకె వేస్తే విలువ అనూహ్యంగా పెరుగుతుంది. ఆ అంకెతో పాటు సున్నా కూడా తన విలువ పెంచుకుంటూ ఉంటుంది. ఇలా ప్రతి అంకె ఒక విలువ ఉంటుంది. కాకపోతే సందర్భం.. అవకాశం వంటివి కలిస్తే వాటి విలువ తెలుస్తుంది. ఇది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి బాగా తెలుసు. ఈ విషయంపై తాజాగా ఓ ఐఏఎస్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఒక్క మార్క్ తో తాను పాసయ్యానని చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తోంది.
గుజరాత్ కు చెందిన నితిన్ ఐఏఎస్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తాజాగా తన జీవితంలో జరిగిన గొప్ప విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. 12వ తరగతిలో తాను కేవలం 24 మార్కులతో పాసయినట్లు తెలిపాడు. అంటే పాస్ మార్కులకు ఒకే ఒక మార్క్ కలిసిందని గుర్తు చేశాడు. అయినా కూడా తాను అనుకున్నది సాధించానని తెలిపాడు. ఈ సందర్భంగా మార్కుల మెమో కూడా ట్వీట్ లో పంచుకున్నాడు. ఈ విధంగా నితిన్ యువత.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఓ స్ఫూర్తివంతమైన విషయం తెలిపాడు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కామెంట్లు.. రీట్వీట్లు భారీగా అవుతున్నాయి.
ఆ ఒక మార్క్ తో పాసయిన నితిన్ ఏకంగా ఐఐటీ మద్రాస్ లో చదివాడు. అంతగా చదివిన నితిన్ చివరకు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్ సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యాడు.