మాస్క్ ధరించకుంటే? విన్నంతనే వణికే డ్యూటీని శిక్షగా వేసిన కోర్టు
మహమ్మారికి చెక్ చెప్పేందుకు ఇప్పటికే పలు శిక్షల్ని తెర మీదకు తీసుకొచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికి పెద్ద మార్పు వస్తున్నది లేదు. ఇలాంటివేళ.. గుజరాత్ హైకోర్టు వినూత్న రీతిలో శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. విన్నంతనే వణికేలా ఉండే ఈ శిక్ష షాకింగ్ గా మారింది. దెబ్బకు దెయ్యం వదిలినట్లుగా.. ఇప్పటివరకు మాస్కు పెట్టని వారు సైతం.. సదరు హైకోర్టు విధించిన శిక్ష గురించి తెలిసినంతనే.. బుద్దిగా మాస్కు పెట్టేసుకోవటం ఖాయమంటున్నారు.
ఇంతకీ.. గుజరాత్ హైకోర్టు విధించిన శిక్ష ఏమిటో తెలుసా? మాస్కు ధరించని వారు కోవిడ్ 19 సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. తాము విధించిన శిక్షకు సంబంధించిన వివరాలతో కూడిన ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని కూడా చెప్పింది. మాస్కు ధరించని వారు తమ ఆరోగ్యంతో పాటు.. ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు మాస్కు ధరించని నేరంపై కోర్టు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు తాజా తీర్పును ఇచ్చింది.
మాస్కు ధరించని వారికి ఐదు నుంచి పదిహేను రోజుల పాటు రోజుకు నాలుగైదు గంటలు కోవిడ్ 19 సెంటర్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఇలా శిక్ష విధించిన వారికి వైద్య సేవలు కాకుండా ఇతర పనులు కేటాయించాలన్న సూచన చేసింది. తమ నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్.. జస్టిస్ బేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ వినూత్న శిక్ష విధించింది. హైకోర్టు ధర్మాసనం నిర్ణయానికి కారణం ఎవరో తెలుసా? విశాల్ అత్వానీ అనే న్యాయవాది. మాస్కులు ధరించని వారిపై న్యాయస్థానం కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వినూత్న నిర్ణయాన్ని వెల్లడించారు.