చదువులు పాడుచేస్తున్న పబ్ జి

Update: 2019-01-23 12:00 GMT
వీడియో గేమ్స్ పిల్లల్ని ఎంతలా పాడుచేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న బ్లూ వేల్స్ గేమ్ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడింది. పెద్దల ప్రాణాలు కూడా తీసింది. ఇప్పుడు మరో గేమ్ మొదలైంది. అదే పబ్ జి. ఈ గేమ్ వచ్చిన కొత్తలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని టెక్-నిపుణులు అంచనా వేశారు. అదిప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేయడం, పిల్లల భవిష్యత్ నే పాడుచేసేంత ప్రమాదకారిగా మారింది.

గంటల కొద్దీ ఈ గేమ్ లో మునిగిపోయి చదువులు నిర్లక్షం చేస్తున్నారు విద్యార్థులు. దీంతో ఇప్పటికే చాలా కాలేజీల్లో ఈ గేమ్ ను నిషేధించారు. తమిళనాడులోని వీఐటీ, ఎస్ ఆర్ ఎమ్ లాంటి కాలేజీల్లో క్యాంపస్ లో, హాస్టళ్లలో ఈ గేమ్ ఆడడంపై బ్యాన్ విధించారు. గేమ్ ఆడుతూ దొరికితే పనిష్మెంట్లు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ స్టూడెంట్స్ ను ఆపడం కష్టంగా మారుతోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడీ గేమ్ ను నిషేధిస్తూ గుజరాత్ ప్రభుత్వం ఏకంగా ఆదేశాలు జారీచేసింది. గేమ్ ను బ్యాన్ చేస్తూ ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం ఇదే ఫస్ట్ టైం. రాష్ట్రంలో ప్రాధమిక పాఠశాల విద్యార్థులు పబ్ జి గేమ్ ఆడకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది.

ఒక్కసారి ఈ గేమ్ ఆడితే అదొక వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యక్తిగత స్థాయిలో ఆడే గేమ్ కాదు. ఓ గ్రూప్ తో కలిసి ఆడే గేమ్. అఁదుకే అంతా దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. గేమ్ లో ఓడిపోతే ఆత్మన్యూనతతో కుంగిపోతున్నారు. ఇలాగే జమ్ముకశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం కూడా కోల్పోయాడు. అంత ప్రమాదకారిగా మారింది  ఈ పబ్ జి గేమ్.



Full View
Tags:    

Similar News