ఆగస్ట్ లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు !
ఈ ఆర్థిక సంవత్సరం లో జీఎస్టీ వసూళ్లు నెల నెలకి భారీగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో వస్తు,సేవల పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం ఆగస్టు ఒక్క నెలలోనే లక్షా 12 వేల 20 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జులై 2021లో జీఎస్టీ వసూళ్లు రూ.1,16,393 కోట్లు కాగా , ఆగస్టు నెలలోనే లక్షా 12 వేల 20 కోట్లు వసూళ్లు నమోదు కావడం గమనార్హం. ఆగస్టులో వచ్చిన మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.20,522 కోట్లుగా ఉంది. స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.56,247 కోట్లుగా ఉన్నాయి.
వీటితో పాటు సెస్సుల రూపంలో మరో రూ.8646 కోట్లు చొప్పున వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. జులై నెలతో పోలిస్తే ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. గతేడాది ఆగస్టులో 86,449 కోట్లు వస్తే, ఈ సారి 30శాతం అధికంగా వచ్చింది. అంతకముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగాయి. గతంలో వరుసగా తొమ్మిది మాసాల పాటు లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు, కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో పడిపోయింది. కరోనా ఆంక్షలు సడలించడంతో వరుసగా జులై, ఆగస్టు మాసాల్లో రూ.లక్ష కోట్లు మార్కు దాటాయి.
ఇదిలా ఉంటే జీఎస్ టీ పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసుకునే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్ వర్క్ GSTN తాజాగా కీలక ప్రకటన చేసింది. గత రెండు నెలలుగా జీఎస్ టీఆర్ 3బీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి భారీ ఝలక్ ఇచ్చింది. ఇకపై ఇలాంటి వారికి జీఎస్ టీఆర్ 1లో ఔట్ వర్డ్ సప్లైస్ వివరాలు దాఖలు చేయడానికి వీలుండదని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తుందని జీఎస్ టీఎన్ తెలిపింది. వ్యాపారులు జీఎస్ టీఆర్ 1 ఫామ్‌ను తర్వాతి నెల 11వ రోజులోపు కచ్చితంగా దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే వారు జీఎస్ టీఆర్ 3బీని తర్వాతి నెలలో 20 నుంచి 24వ రోజు మధ్యలో దాఖలు చేయాలి. వ్యాపారులు జీఎస్ టీఆర్ 3బీతోపాటు నెలవారీ పన్నులు కూడా చెల్లించాలి. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల కోసం, అతను మునుపటి పన్ను కాలానికి GSTR-3B ఫారమ్‌లో రిటర్న్ ఇవ్వకపోతే GSTR-1 ఫైలింగ్ చేయలేరు. సీజీఎస్ టీ రూల్స్ 2017 రూల్ -59 (6)లో భాగంగా కొత్త రూల్స్ సెప్టెంబర్ 1 2021 నుంచి అమలులోకి వస్తాయని జీఎస్ టీఎన్ తెలిపింది.