నిన్నటివరకు టీఆర్ ఎస్ పాలసీ..ఇపుడు బీజేపీ పాలసీ!
తెలంగాణలో విస్తరించడానికి ఉద్ధృతంగా ప్రయత్నిస్తున్న బీజేపీని ఎలా అడ్డుకోవాలో తెలియక టీఆరెస్ పార్టీ టెన్షన్ పడుతోంది. అసలు బీజేపీని ఎలా ఎదుర్కోవాలి.. తలపడాలా.. సర్దుబాటు చేసుకోవాలా అన్నది నిర్ణయించుకోలేని పరిస్థితిలో కనిపిస్తోంది. అందుకే నేరుగా విమర్శలు చేయడానికి వెనుకాడుతూనే పరోక్షంగా పదునైన విమర్శలు చేస్తోంది. సరే.. ఇదంతా పక్కనపెడితే బీజేపీపై టీఆరెస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
’కొందరు తమతో ఉంటే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు‘ అనేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గాంధీని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ సాద్వి ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. గాంధీని చంపిన వాళ్లను దేశభక్తులుగా అభివర్ణించిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్ ను కొందరు సమర్థించడం తనకు ఆందోళన కలిగించిందని అన్నారు. తెలంగాణ వికాస సమితి మహాసభల ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మతం అన్నది పూర్తిగా వ్యక్తిగతమని... దాన్ని వేరే అంశాలతో ముడిపెట్టడం సరికాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో మతోన్మాదం పెరిగితే భవిష్యత్ తరాలకు ముప్పుతప్పదని కేటీఆర్ అన్నారు.
అయితే.. టీఆర్ ఎస్ దీ అదే విధానమని.. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ ఇలాంటి గేమ్ నే ఆడిందని రాజకీయ విశ్లేషకుల మాట. బీజేపీపై విమర్శలు గుప్పించడం ఏంటి.. అది మీ ఐడియానే కదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, ఆ తరువాత కానీ ఎవరయినా టీఆరెస్ నాయకుల మాటలను ఖండించినా - సవరించినా కూడా ఆ పార్టీ పెద్దల నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు సహించేవారు కాదు. తెలంగాణ ద్రోహి అంటూ ముద్ర వేసేవారు. అది ఇప్పటికీ కొన్ని విషయాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీపై కేటీఆర్ అవే విమర్శలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
టీఆరెస్ చేసిన పనినే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తోందని.. తమ విధానాలనే బీజేపీ అనుసరిస్తుంటే టీఆరెస్ లో గుబులు మొదలైందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మొన్న కశ్మీర్ విభజన - ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో టీఆరెస్ కూడా బీజేపీకి మద్దతిచ్చింది. పైగా మజ్లిస్ పార్టీని - ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ను తమ పార్టీలో భాగంగానే భావిస్తున్నంతగా బాహాటంగానే చెబుతున్న టీఆరెస్ ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీకి పార్లమెంటులో మద్దతిచ్చి హైదరాబాద్ లో విమర్శలు చేయడంపై నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు.