ఏపీకి శుభవార్త .. హైదరాబాద్ -బెంగళూరు కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ !
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పారిశ్రామికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటులో భాగంగా రూపుదిద్దుకునే హైదారాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఏపీకి చోటు కల్పించింది. ఏపీ మీదుగా వెళ్లే ఈ కారిడార్లో ఏపీలోని ప్రాంతాలకు కూడా సముచిత స్ధానం కల్పించింది. విశాఖ పట్నం- చెన్నై (వీసీఐసీ), బెంగుళూరు- చెన్నై (బీసీఐసీ) కారిడార్ల పనులు జరుగు తున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్- బెంగుళూరు మధ్య మరో కారిడార్ ఏర్పా టుకు అనుమతి ఇచ్చింది. దీనితో కర్నూలు జిల్లాకు మహర్దశ పట్టబోతుంది.
తెలంగాణ, ఏపీ, కర్నాటక మూడు రాష్ట్రాలకు ప్రయోజనం ఉండేలా రూపుదిద్దుకోనున్న ఈ కారిడార్ ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ కారిడార్ ఏర్పాటుతో దక్షిణాదిన పారిశ్రామిక అభివృద్ధిలో మూడు రాష్ట్రాలను భాగస్వాముల్ని చేసినట్లు అవుతుందని కేంద్రం చెబుతోంది. ఈ కారిడార్‌లో భాగంగా పలు కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు త్వరలోనే మొదలు కానున్నాయి. ఈ కారిడార్ కు ఓర్వకల్ నోడ్ గా ఉంటుందని రాష్ట్ర పరి శ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం పారిశ్రామిక కారి డార్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ ఐసీడీఐటీ) ద్వారా కొత్త కారిడార్ అభివృద్ధి జరుగుతుందన్నారు. విశాఖపట్నం , చెన్నై కారిడార్ లో కడప జిల్లా కొప్పర్తి, చెన్నై, బెంగుళూరు కారిడార్ లో నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, చిత్తరు జిల్లా రౌతు సురుమల నోడ్ లు అభివృద్ధి చెందుతాయని వివరించారు. మూడు కారిడార్లతో రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో పరుగులు తీస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వానికి మరో కొత్త ప్రతిపాదన అందింది. తిరుపతిలో ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చింది. ఈ మేరకు వాక్ టూ నెక్స్ట్ కాన్సెప్ట్ తో తిరుపతిలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చినట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి ప్రకటించారు. ఐ.టీ పార్కు ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని కపిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సామర్లకోట- రాజానగరం రహదారి పనులపై మంత్రి ఆరా తీశారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ క్లస్టర్‌లో పరిశ్రమలకు అవసరమైన నీటిని నిల్వ చేసుకునే కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనుల పురోగతిపై చర్చించారు.