రెబల్ స్టార్ కి గవర్నర్ గిరి!

Update: 2015-08-28 12:04 GMT
నందమూరి తారక రామారావు.. ఎంజీఆర్.. జయలలిత.. సినీలోకం నుండి రాజకీయ సింహాసనాన్ని అదిరోహించిన నటులు ఎందరో. కళాకారుడు దేన్నైనా సాధించగలడు ఏ పదవికైనా అర్హత సంపాదించగలడు అని నిరూపించిన వ్యక్తులు.. కాదు శక్తులు వీరంతా! సాదారణ నటులుగా కెరీర్ స్టార్ట్ చేసి రాజకీయంగా కూడా ఉన్నత స్థానాలను అదిరోహించిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా రెబల్ స్టార్ గా సుపరిచితులైన కృష్ణంరాజు కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నారు!

బీజేపీ నుండి అటల్ బిహార్ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కృష్ణంరాజు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత కొద్ది కాలంగా సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నా... రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు! ఇదిలా ఉంటే... తాజాగా కృష్ణం రాజుకి సంబందించి ఒక ఆసక్తికరమైన వార్త వినబడుతుంది. మోడీతో మాంచి సాన్నిహిత్యం ఉన్న కృష్ణంరాజుకి ఒక గౌరవప్రదమైన పదవి రాబోతోందని ఆ వార్త సారాంశం. ఇప్పటికే కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడికి గౌరవమైన పదవి అంటే ఇంకేమిటి... "గవర్నర్ గిరీ" అయ్యి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంతా అనుకున్నట్లే జరిగితే... రెబల్ స్టార్ కృష్ణం రాజు కాస్తా.. గవర్నర్ కృష్ణం రాజు అవుతారన్నమాట!
Tags:    

Similar News