• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Jobs >  లే ఆఫ్ లతో...

లే ఆఫ్ లతో దడపుట్టిస్తున్న ఐటీ కంపెనీలు !

| ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-05-05 17:30 GMT

ఇంజనీరింగ్ చేస్తే కొలువు గ్యారంటీ అన్న విద్యార్థులతో పాటు ఇప్పటికే కొలువుల్లో ఉన్న టెకీలకు ఐటీ కంపెనీల నిర్ణయాలు దడ పుట్టిస్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల నుండి ఐటీ కంపెనీలు ఈసారి కేవలం 70,000-80,000 మందిని మాత్రమే నియమించుకొనే అవకాశాలున్నాయి. ఏకంగా ప్రతిష్టాత్మక ఐఐటీ ముంబయి నుండే క్యాంపస్ ప్లేస్ మెంట్లు పడిపోవడం దీనికి నిదర్శనం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టా అందుకోనుండగా, ఇందులో 10 శాతం కంటే తక్కువ మందే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు దక్కించుకొనే అవకాశం ఉన్నది. ఈ ప్రభావం టైర్‌-2 కాలేజీలపై భారీగా పడనున్నది. ముఖ్యంగా ప్లేస్‌మెంట్లపైనే ఆధారపడి నడిచే అనేక కాలేజీలు తీవ్రంగా నష్టపోనున్నాయి.

వరుసగా రెండో ఏడాది కూడా ఇన్ఫోసిస్‌, విప్రో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. టీసీఎస్‌ కూడా తక్కువ మందినే నియమించుకుంటామని ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్‌బుక్‌, అమెజాన్‌ మొదలుకొని చిన్నాచితక కంపెనీల దాకా అన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాదిలాగే ఈసారి కూడా ఈ వ్యవహారం కొనసాగుతున్నది. ఈ ఏడాది జనవరిలోనే అన్ని కంపెనీలు కలిపి 30 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ నెల 3వ వరకు 122 సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు 31,751 మందిని ఇండ్లకు పంపడం గమనార్హం.

Tags:    
  • ItCompanies 
  • Employees 
  • Students 
  • Degree 
  • IITMumbai 
  • Campus 
  • Placements 
  • CampusPlacements 
  • Tcs 
  • Amazon 
  • Layoffs 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

మ్యాన్ పవర్.. భారత్ కు బిగ్గెస్ట్ అడ్వంటేజ్ కాబోతోందా?

2026-10-31 10:30 GMT

మైక్రోసాఫ్ట్ 60 వేల మందికి బైఔట్ ఆఫర్.. కానీ బయటకు వెళ్లేది 3 వేల మందేనా?

2026-10-31 05:17 GMT

'టెక్' కన్నీళ్లు.. రోజుకు 654 కుటుంబాల్లో ఆరిపోతున్న ఆశల దీపాలు

2026-10-29 09:20 GMT

నువ్వు ఎంతో తోపు అయినా నీ జాబ్ ఉండదు.. ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు.. కారణమిదీ..

2026-10-28 06:42 GMT

"సిస్టమ్ షట్‌డౌన్" అయ్యే ప్రమాదం ఉంది గురూ.. భారత ఐటీ రంగంలో భారీ ఉద్యోగ కోతలు తప్పవా?

2026-10-27 06:33 GMT

మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్?

2026-10-26 18:22 GMT

92 వేల ఉద్యోగాలు మాయం.. కుప్పకూలుతున్న భారత ఐటీ రంగం?

2026-10-23 16:30 GMT

ఏఐ కోర్సులు చదివితే లక్షల్లో జీతం వస్తుందా? ఉద్యోగం కోసం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అసలు నిజాలు

2026-10-22 17:30 GMT

ఏఐ యుగంలోనూ రైటర్లకు భారీ డిమాండ్.. ఆంథ్రోపిక్‌లో రూ.3 కోట్ల ఉద్యోగం వెనుక కారణాలివే..

2026-10-22 10:30 GMT

ఏఐ యుగంలో ఉద్యోగుల హక్కులకు కొండంత అభయం

2026-10-08 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS