కడప స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులకు ప్రభుత్వం ఆహ్వానం
ఏపీలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెట్టుబడులు కల్పించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషిచేస్తోంది. ఇందుకోసం పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నది. అభివృద్ధి ఒక్కప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పేలా కృషిచేస్తున్నది. తాజాగా కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ప్రైవేట్ సంస్థలను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు శుక్రవారం గ్లోబల్ నోటీసు జారీచేసింది. జాయింట్ వెంచర్ ప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించినందున ఆసక్తి కలిగిన ప్రైవేటు భాగస్వాములు ప్రతిపాదనల్ని సమర్పించాలంటూ నోటీసులో ప్రభుత్వం పేర్కొంది.
వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను సమర్పించాలని కోరింది. అంతర్జాతీయంగా ఆసక్తి ఉన్న సంస్థలు ఆర్ఎఫ్పీ సమర్పించాలని సూచించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి వివాదాలు లేని 3500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఈ గ్లోబల్ నోటీసులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఏడాది 2 టీఎంసీల నీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నాలుగు లైన్ల రహదారులు, రైలు కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని గ్లోబల్ నోటీసులో ప్రస్తావించింది. వీటితో పాటు ఎగుమతులు, దిగుమతుల కోసం కృష్ణపట్నం, రామాయపట్నం ఓడరేవులు స్టీల్ ప్లాంట్‌కు సమీపంలో ఉన్నాయని వివరించింది. ముడి ఇనుము నిల్వలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కూడా ఈ యూనిట్‌కు సమీపంలోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో పేర్కొంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టించి ఉద్యోగుల కల్పనకు కృషి చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా పెట్టుబడులు పెట్టే కంపెనీల్లో స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. కోర్టుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతే విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు శాసనరాజధాని అమరావతిని, న్యాయరాజధాని కర్నూలును కూడా ఏపీ ప్రభుత్వం సమాన స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నది.