• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తాలిబన్లకి బిగ్ షాక్.. ఆ...

తాలిబన్లకి బిగ్ షాక్.. ఆ ఈ-మెయిల్స్ కి గూగుల్ లాక్

By - Tupaki Desk
Update: 2021-09-04 15:30 GMT
ఆఫ్ఘానిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో అందరికి తెలిసిందే. ఆఫ్ఘన్ నుండి అమెరికా వెనక్కి వెళ్లిపోయిన గంటల వ్యవధిలోనే తాలిబన్లు ఆఫ్ఘన్ ను తమ స్వాధీనం చేసుకున్నారు. గత 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో ఆఫ్ఘన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు దేసం దాటి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ సమయంలో తమకి వ్యతిరేకంగా పని చేసిన వారిని కనిపెట్టి , వారిని చంపేయాలని తాలిబన్లు చూస్తున్నారు. అయితే , తాలిబన్ల కి గూగుల్ షాకిచ్చింది.

గత ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం అందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు అకౌంట్లు, మెయిల్స్‌ ను తాత్కాలికంగా బ్లాక్‌ చేసినట్లు ప్రకటించిన గూగుల్‌. మరోవైపు తాలిబన్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోలేదు. గత అఫ్గన్‌ ప్రభుత్వానికి సంబంధించిన ఈ-మెయిల్‌ అకౌంట్లను, మాజీ అధికారుల మెయిల్స్‌ ను, అఫ్గన్‌ డిజిటల్‌ డేటా సర్వర్‌లను గూగుల్‌ తాతాల్కికంగా బ్లాక్‌ చేసింది. అయితే అది ఏ సంఖ్యలో అనేది గూగుల్‌ వెల్లడించలేదు. అఫ్గన్‌ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, వాటిని అన్‌ బ్లాక్‌ చేసే విషయంపై వేచిచేత ధోరణిని అవలంభించనున్నామని శుక్రవారం గూగుల్‌ మాతృక సంస్థ ఆల్ఫాబెట్‌ ఓ ప్రకటనలో విడుదల చేసింది.

ఒకవేళ తాలిబన్లు పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా.. ఆ వివరాల్ని అందించే ఉద్దేశంలో గూగుల్‌ లేదని తెలుస్తోంది. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ప్రభుత్వ అధికారులు, విదేశాలకు చెందిన ప్రతినిధులు అఫ్గన్‌ వ్యవస్థకు చెందిన కీలక సమాచారా వదిలేసి పారిపోయారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాలంటూ గూగుల్‌కు, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు మెయిల్స్‌ ద్వారా తాలిబన్‌ సంస్థ రిక్వెస్ట్‌ మెయిల్స్‌ పెడుతోంది. ఒకవేళ ఆ డాటా తాలిబన్ల చేతికి వెళ్తే పరిస్థితి ఏంటన్నది అంచనా వేయలేకపోతున్నారంతా. పైగా బయోమెట్రిక్‌ డేటా బేస్‌ ఆధారంగా చేసుకుని కొత్త ప్రభుత్వం, గతంలో తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను, పని చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే , తాలిబన్లు మాత్రం ప్రభుత్వ-ఆర్థిక సంబంధిత వ్యవహారాల కోసమే తాము డిజిటల్‌ డాటాను కోరుతున్నామని చెప్తున్నారు. అమెరికాకు ఏజెంట్లుగా పని చేసిన అఫ్గన్‌ పౌరులను క్షమించి వదిలేస్తున్నామని ఇది వరకే ప్రకటించామని, అఫ్గన్‌ వ్యవస్థ సజావుగా నడవాలంటే పాత రికార్డులు తప్పనిసరిగా అవసరమని తాలిబన్లు చెప్తున్నారు. కానీ, ఈ విషయంలో తాలిబన్లను నమ్మే ప్రసక్తే లేదని అమెరికా అంటోంది. దురాక్రమణ టైంలో కీలక సమాచారానికి చెందిన సర్వర్స్‌ను తాలిబన్లు భద్రపరిచే ప్రయత్నాలు చేశారని, అఫ్గన్‌ లో అమెరికా నిర్మించిన డిజిటల్‌ వ్యవస్థను ట్రేస్‌ చేసే ప్రయత్నామూ జరిగిందని అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి


Tags:    
  • Afghanistan 
  • Taliban 
  • Latest news 
  • Latest Updates 
  • Taliban 
  • Google lock 
  • e-mails 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS