గూగుల్ ఇండియా పరుగులు.. 35% పెరిగిన ఆదాయం

Update: 2020-11-27 10:30 GMT
ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ గూగుల్​ మనదేశంలో భారీగా ఆదాయాన్ని పెంచుకున్నది. గతంలో కంటే ఇది మరింత ఎక్కువ. కరోనా టైంలో ఈ రంగం ఆరంభం అనే తేడా లేదు.. అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితుల్లోనూ గూగుల్ లాభాల పంటపండించుకున్నది. గత ఏడాది కన్న 35 శాతం అధికంగా లాభాలు పొందినట్టు ఆ సంస్థ వెల్లడించింది.

ఉద్యోగుల శ్రమ, కంపెనీ అవలంభించిన వ్యూహాత్మక నిర్ణయాల వల్లే ఆదాయాన్ని పెంచుకోగలిగామని ఆ సంస్థ వెల్లడించింది. కరోనా లాక్​డౌన్ తో పలు సాఫ్ట్​వేర్​ కంపెనీలు కొంతమేర ఆదాయాలను కోల్పోయినప్పటికి.. గూగుల్​ ఇండియా మాత్రం ఆదాయాన్ని పెంచుకున్నది. గత ఏడాది రూ. 4,147 కోట్లు ఉన్న ఈ సంస్థ ఆదాయం ఈ ఏడాది రూ. 5,594 కోట్లకు పెరిగిందని సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఏడాది ఇండియాలో కంపెనీని మరింత విస్తరిస్తామని గూగుల్​ సంస్థ అధికారులు చెప్పారు. మరో 400 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు.

 కరోనా  టైంలో చాలా కంపెనీలు  వర్క్ ఫ్రం హోం నిర్వహించాయి. అయితే ఉద్యోగులకు ఇళ్ల వద్ద నుంచి పని చేయడానికి భారీగానే డేటా వినియోగించారు. కరోనా వల్ల సాధారణ ప్రజానీకం కూడా ఇళ్లకే  పరిమితం కావడంతో  అవసరాల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వినియోగించుకున్నారు. డేటా ఎక్కువగా వాడుకున్నారు. ఈ విధంగా గూగుల్ ప్రకటనలు పెరిగాయి.  జనాలు ఎక్కువగా యూట్యూబ్ ని వీక్షించడం వల్ల అందులో గూగుల్ ప్రకటనలు  కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి.  దీనివల్ల కూడా గూగుల్ భారీగా ఆదాయం పెరిగింది.  అందుకే గూగుల్ ఇండియా ఒక్క ఏడాదిలోనే 35 శాతం అదనంగా ఆదాయం పొందగలిగింది.
Tags:    

Similar News