23కోట్ల వినియోగదారులకు కేంద్రం శుభవార్త

Update: 2020-03-31 12:34 GMT
కరోనా వైరస్ కేసుల తీవ్రత దేశంలో రోజురోజుకు పెరుగుతోంది. లాక్ డౌన్ తో కంట్రోల్ చేసినా తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తో వ్యాపార, వాణిజ్యాలు అన్ని బంద్ అయిపోయాయి. అందరూ ఇళ్ల కు చేరారు. ఈ నేపథ్యంలోనే వాహనదారులకు కేంద్రం గొప్ప శుభవార్తను అందించింది.

డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్ 30 వరకూ కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 23 కోట్ల మంది వాహన యజమానులు, 1.2 కోట్ల వాహనాలకు భారీ ఊరట లభించినట్టైంది.

లాక్ డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో పౌరులు ఇబ్బందులును ఎదుర్కొంటున్న పరిస్థితి కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మార్చి 31తో గడువు ముగిసే డ్రైవింగ్ లైసెన్స్ లు, స్టేట్ లేదా నేషనల్ పర్మిట్లు వాహన ఫిట్ నెస్ పరీక్షలను జూన్ 30 వరకు పొడిగిస్తున్న కేంద్రం తాజాగా తెలిపింది.

లాక్ డౌన్ వేళ నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహనాలకు సంబంధిత పత్రాలు లేకపోవడం తో పోలీసులు అడ్డుకుంటున్నట్టు నివేదికలు అందడం తో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు ఫిబ్రవరి 1 - 2020 నాటికి గడువు ముగిసిన పత్రాలను జూన్ 30 - 2020 వరకు చెల్లుబాటు అయ్యేలా అమలు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు కేంద్రం సూచించింది. ఆన్ లైన్లోనే ఎన్ ఐసీ ఇస్తోంది.
Tags:    

Similar News