ఐటీ ఉద్యోగులకు శుభవార్త .. ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ !

Update: 2020-07-22 09:10 GMT
కరోనా వ్యాధి నిర్ములన కోసం ప్రభుత్వాలు,  పలు సంస్థలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపనీలు తమ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్  ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను  డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. గతంలో  జూలై 31వ తేదీ వరకు ఉంది.  వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోంను డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించినట్లు డాట్మం గళవారం రాత్రి ట్వీట్ చేసింది.

ప్రస్తుతం కంపెనీని బట్టి 85 శాతం నుండి 90 శాతం మంది  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫీసులకి వెళ్లి పని చేయడం ఇబ్బందికరంగా ఉంది. కరోనా వెలుగులోకి వచ్చిన మొదట్లో  డాట్  ఏప్రిల్ 30వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. ఆ తర్వాత జూలై 31 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ ఏడాది చివరి వరకు వెసులుబాటు కల్పించింది. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును పొడిగించడాన్ని నాస్కామ్ అధ్యక్షులు స్వాగతించారు. డాట్‌కు, కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విప్రో చైర్మన్ రిషద్ బెనర్జీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు

 కాగా చాలా ఐటీ కంపెనీలు మిశ్రమ వర్కింగ్ మోడల్ ‌కు మారుతున్నాయి. క్రమంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ ‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు 2025 నాటికి 75 శాతం వర్క్ ఫ్రమ్ ఉండాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా 90 శాతం వరకు ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. కరోనా తర్వాత కార్యాలయాలకు వచ్చినప్పటికీ ఐటీ కంపెనీలు ఉద్యోగులను క్రమంగా ఇంటికి పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌ తో ఉద్యోగుల ప్రయాణ భారం తగ్గడంతో పాటు కంపెనీలకు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇప్పటికే జూన్ క్వార్టర్ ‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రయాణ ఖర్చులు 86 శాతం తగ్గినట్లుగా భావిస్తున్నారు
Tags:    

Similar News