అధికారులకు దిమ్మ తిరిగే షాకిచ్చిన గ్రీన్ బవార్చి

Update: 2017-02-17 10:00 GMT
తరచూ రెస్టారెంట్లలో తినేవారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త ఇది.  మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. నగర జీవితంలో ఎక్కువమంది ఇంట్లో కంటే.. బయట ఫుడ్ మీద ఆధారపడుతుంటారు. నగరంలోని స్పీడ్ లైఫ్ తో పాటు.. లైఫ్ స్టైల్లో భాగంగా బయట తినటం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే.. అలా బయట తినే వారంతా జాగ్రత్తలు తీసుకొని తినాల్సిన అవసరం ఎంత ఉందో చెప్పే ఉదంతం ఇది. పలు రెస్టారెంట్లలో కిచెన్లు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు తరచూ సర్ ప్రైజ్ విజిట్స్ చేసి.. లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని చెక్ చేస్తుంటారు.

తాజాగా అలాంటి పనే చేసిన గ్రేటర్ అధికారులకు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యే ఉదంతాలు ఎదురయ్యాయి. మల్కాజిగిరి డివిజన్ లోని మీర్జాలగూడలోని గ్రీన్ బవార్చీ రెస్టారెంట్ లోని కిచెన్ లోకి వెళ్లిన అధికారులకు నోట మాట రాలేదు. అక్కడున్న మాంసం కుళ్లిపోయి ఉండటం.. దాంతోనే బిర్యానీని తయారుచేస్తున్న వైనం చూసి అవాక్కయ్యారు. అక్కడున్న మాంసం దాదాపు పది రోజుల పాతదని.. కుళ్లిపోయి కంపు కొడుతుందని.. దాన్ని చూసిన వెంటనే వాంతి చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. కుళ్లిన మాంసంతో బిర్యానీ చేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు. రూ.10​ ​వేలు ఫైన్ వేశారు.

ఇక.. మల్కాజ్ గిరిలోని స్వాగత్ గ్రాండ్ హోటల్  లో అక్రమంగా పశువధశాల ఉన్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. స్టాంపు వేసిన మాంసాన్ని మాత్రమే తీసుకోవాలని స్వాగత్ గ్రాండ్ హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News