కాంగ్రెస్ కు గ్రేటర్ ఎన్నికల కష్టం.. గట్టెక్కుతుందా?
ఎవ్వరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల నగారా మోగించి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లను గుక్కతిప్పుకోనివ్వకుండా చేశారు. బీజేపీ ఇప్పటికే ఇన్ చార్జిలను నియమించి సిద్ధమవ్వగా కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోనే లేదు. ఇప్పటికే దుబ్బాక సహా తెలంగాణలో వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ఎన్నికల్లోనూ సంపూర్ణ విజయాన్ని.. మెజార్టీని సాధించింది లేదు. కేసీఆర్ దెబ్బలకు కుదేలవుతూనే ఉంది. దుబ్బాకలో అయితే మూడోస్థానానికి పడిపోయి బావురుమంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను బీట్ చేసి బీజేపీ ముందుకు దూసుకు వస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నిక కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక తలనొప్పిలా మారిందనే చెప్పాలి. గతంలో జీహెచ్‌ఎంసీల అభ్యర్థుల్లో కొందరికి మళ్లీ టికెట్లు ఇచ్చినా.. ఇంకా మినిమం వంద మందికి పైగా అభ్యర్థులను అయితే సెలక్ట్ చేయాల్సి ఉంది. అంతేకాదు.. అసంతృప్తులను బుజ్జగించాల్సి ఉంటుంది. అంతకుమించి ఇప్పటికే ప్రతి ఎన్నికలోనూ అభాసుపాలవుతూ వస్తున్న కాంగ్రెస్‌కు.. గ్రేటర్‌లో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. మరి దానిని కాపాడుకోవాలంటే అందుకు తగినట్లుగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే కాంగ్రెస్‌లో గ్రూపుల గలాటా నడుస్తూనే ఉంది. మరి ఈ క్రమంలో ఎవరు ఏ అభ్యర్థిని రెకమండ్ చేస్తారో ఎవరికీ తెలియదు. తాము చెప్పిన అభ్యర్థికి బీఫామ్ దక్కలేదని వారు అలకబూనినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు ఈ ఎన్నికలు ఫ్యూచర్ కాంగ్రెస్ కోసం ఎంతో ఉపయోగపడనున్నాయి. ఫ్యూచర్‌లో పార్టీ భవిష్యత్‌నూ నిర్ణయించనున్నాయి. అందుకే.. ఈ ఎన్నికలు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కూడా ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఆయన తన పదవిని కాపాడుకోవాలంటే ఓ మాదిరి రిజల్ట్ సాధించాల్సిన పరిస్థితి ఉంది.
దిగ్గజ కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్ లో చేరడంతో ఇప్పుడు పట్టున్న నేతలు గ్రేటర్ లో కాంగ్రెస్ లో లేకుండా పోవడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది. ఇక కాంగ్రెస్ ను నడిపించే నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. ఇటీవల వరదలను కూడా క్యాష్ చేసుకోలేని దుస్థితి కాంగ్రెస్ నేతలది. సో ఈ గ్రేటర్ గండం ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి.