గ్రేటర్ ఎన్నికలపై నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలో ఏముంది?
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం విజయవంతంగా పూర్తైంది. పోలింగ్ సరిగా సాగలేదన్న హడావుడి.. హైదరాబాదీయుల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన తీరు ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ నగరానికి ఏమైందంటూ నగర జీవులపై ఆగ్ర హాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ సైతం.. ఓటు వేయని తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా ఓటు వేసిన వారికి మాత్రమే అందజేయాలన్న ప్రతిపాదనపైనా పెద్ద చర్చే జరిగింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలింగ్ తర్వాత.. ఎవరికి వారు.. ఫలితం ఎలా ఉంటుందన్న అంశంపై ఎవరికి తోచింది వారు చెప్పుకున్నారు. మరి.. నిఘా వర్గాలు తయారు చేసిన నివేదికలో ఏముంది? ప్రభుత్వాధినేతకు.. కీలకమైన వారికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్న అంశాలు ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గ్రేటర్ ఎన్నికలపై నిఘా వర్గాలు అందించిన రిపోర్టుతో ప్రభుత్వం సంతోషంగా ఉందంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినతట్లు కాకున్నా.. కాస్త అటుఇటుగా మంచి ఫలితాల్ని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కనిపించిన పోటీ వేళ.. అధికారపక్షం వేసుకున్న అంచనాలకు మిన్నగా ఫలితాలు ఉంటాయంటున్నారు. కచ్ఛితంగా ప్రభుత్వం సంతోషానికి గురయ్యే వీలుందన్న మాట రిపోర్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ తో పాటు.. ఎగ్జిట్ పోల్ మీద ఉన్న పరిమితుల నేపథ్యంలో వివరాల్ని వెల్లడించటం లేదన్నది మర్చిపోకూడదు. అయితే.. తమ అంచనాలకు తగ్గని రీతిలో.. ఆ మాటకు వస్తే కొందరి అనుమానాల్ని పటాపంచలు చేసేలా నివేదిక ఉన్నట్లు సమాచారం. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికకు తగ్గట్లే.. తుది ఫలితం ఉందా? లేదా? అన్న విషయం తేలాలంటే.. మరో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు.