జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఈవీఎంలా? బ్యాలెట్లా?
జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు వాడాలా? బ్యాలెట్లు వాడాలా అనే దానిపై ఆరాతీస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలను ఈ సంవత్సరం ఆఖరు వరకు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా దృష్ట్యా ఎన్నికల నిర్వహణ విధానంపై పార్టీల అభిప్రాయాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. పోలింగ్ కోసం ఈవీఎంలు వాడాలా? లేదా బ్యాలెట్లు వాడా? అనేది చెప్పాలని ఎన్నికలు సంఘం కోరింది.
ఈ నెలాఖరులోపు పార్టీలు అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. ఆ తరువాత నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కాగా ప్రతిపక్షాలు మాత్రం ఈవీఎంలతో తేడా కొడుతోందని.. బ్యాలెట్ నే వాడాలని కొద్దికాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం గత స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహించి పారదర్శకత చూపింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ లేదా జనవరిలో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలను తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఇక ప్రతిపక్షాలు కూడా బాగానే కసరత్తు చేస్తున్నాయి . ఎలాగైనా జీహెచ్‌ఎంసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.