ఘట్‌కేసర్‌ ఫార్మసి విద్యార్థిని ఆత్మహత్య .. అసలు ట్విస్ట్ ఇదే !

Update: 2021-02-24 11:10 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఘట్‌ కేసర్ ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో మరో సంచలనం.. . కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించిన  యువతి, షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు, పోలీసులను ఇబ్బందులకు గురి చేసిన ఆ యువతి చివరికి  ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా ఈ కేసులో కీలక  ట్విస్ట్‌ వెలుగు చూసింది. సదరు యువతి మంగళవారం మధ్యాహ్నం షుగర్‌ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం. దాంతో యువతి కుటుంబ సభ్యులు మొదట ఆమెని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం యువతిని ఇంటికి పంపించారు వైద్యులు. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక యువతి మరోసారి షుగర్‌ మాత్రలు మింగినట్లు తెలిసింది.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున యువతి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెని ఘట్ ‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కొనసాగుతుండగా ఆ  యువతి మరణించింది. ఫిబ్రవరి రెండో వారంలో కాలేజీ నుంచి తిరిగొస్తుండగా ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేశారంటూ ఫార్మసీ స్టూడెంట్ తన తల్లికి ఫోన్ చేసిన చెప్పిన సంగతి తెలిసిందే. ఆ యువతి తల్లి డయల్ 100కు కాల్ చేయడంతో గంటన్నర వ్యవధిలోనే పోలీసులు బాధితురాలిని గుర్తించారు. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆ యువతి వాపోయింది. ఆమె చెప్పిన ఆధారాలతో పోలీసులు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

ఆ మార్గంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు మూడు రోజులపాటు శ్రమించి, ఆమె చెప్పిందంతా అబద్ధమేనని తేల్చారు. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేకపోయినప్పటికీ ఆటోడ్రైవర్లు బాధితులుగా మిగిలిపోయారు. పోలీసులు క్షమాపణలు చెప్పినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పోలీసులతో ఆమె మాట్లాడిన కాల్ రికార్డ్ సైతం బయటకొచ్చింది. పోలీసులు ఆమె ఆచూకీ కనుక్కోవడం కోసం హైరానా పడుతుండగా.. వాళ్లను మరింత టెన్షన్ పెట్టేలా ఆ యువతి నటించింది. ఈ ఉదంతంతో అప్రమత్తమైన పోలీసులు.. తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే.. సెక్షన్ 193 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Tags:    

Similar News