పంత్​ ను ధోనీ తో పోల్చడం మానేయండి..ఆ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

Update: 2020-11-07 08:50 GMT
మహేంద్రసింగ్​ ధోని టీంఇండియాలో ఓ లెజెండరీ బ్యాట్స్​మెన్​, కెప్టెన్​. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ‌ ఇలా మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిన ఘనత ఒక్క ధోనీకే దక్కుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ  గుడ్​బై చెప్పాడు. కానీ ఐపీఎల్ ​లో మాత్రం ఇంకా ఆడుతున్నాడు. అయితే మహేంద్రసింగ్​ ధోనీ  లేని లోటును భారత్​కు రిషబ్​ పంత్​ తీర్చుతాడని అంతా భావించారు. రిషబ్​ మరో ధోనీ  అంటూ అభిమానులు అతడిని పిలుచుకుంటారు. అందుకు తగ్గట్టే రిషబ్​కూడా తొలి నాళ్లలో బాగానే రాణించాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జాతీయ జట్టులోకి వచ్చిన పంత్ ఆసీస్ టూర్ లో టెస్టుల్లో వరుసగా రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. వన్డే లలో కూడా చోటు సంపాదించుకున్నాడు.  కొంత కాలంగా పంత్‌ ఆశించిన స్థాయి లో ఆకట్టుకో లేక పోతున్నాడు. వరల్డ్ కప్ లో కూడా బ్యాటింగ్ మాత్రమే కాదు కీపింగ్ లోనూ ఆకట్టుకో లేకపోయాడు. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టులో చోటు కోల్పోయాడు. వికెట్‌ కీపర్‌ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేయడంతో మెల్లగా అతడికి అవకాశకాలు సన్నగిల్లాయి.

 ఇక ఐపీఎల్ 2020లో పంత్ సత్తా చాటుతాడని భావించగా.. అది జరగలేదు. అతడి స్కోరు ఒక్కసారి కూడా 40కి దాటలేదు. ఈ నేపథ్యంలో పంత్ పై  ఢిల్లీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ రిషబ్​ పంత్​ ఎప్పటికీ ఎంస్​ ధోనీ కాలేడు. అతడిని రిషబ్ ​గానే ఉండనివ్వండి. అనవసరంగా అతడి మీద ఒత్తిడి పెంచడం తో సరిగ్గా ఆడ లేక పోతున్నాడు. ఎంఎస్‌ ధోనీలాగా సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఎవరూ మహీలా అయిపోరు. పంత్​ తన ఆట తీరును ఇంకా మెరుగు పరుచుకోవాలి. ఎంతో పరిణతి సాధించాలి’ అంటూ గంభీర్​ వ్యాఖ్యానించాడు
Tags:    

Similar News