గంటా రాజీనామా.. ఉట్టిదేనట.?
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికంటే ముందే స్పందించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అధికార, ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేశాడు. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసిన గంటా తాను ఉక్కు కర్మాగారం కోసం త్యాగం చేస్తున్నట్లుగా ప్రకటించారు.
దీనిపై బోలెడు విమర్శలు వచ్చినా ఆయన రాజీనామా కట్టుకథ అని అన్నా ఆయన మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి స్పీకర్ కు రాజీనామా పంపించారు.అయితే గంటా రాజీనామా అంతా జనాలను మభ్యపెట్టే వ్యవహారమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. గంటా ఎన్ని సార్లు రాజీనామా చేసినా అక్కడ ఆమోదం పొందదు అంటూ బాంబు పేల్చారు. గంటా ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉంటారంటూ ప్రకటించారు.
గంటా రాజీనామా స్థానిక ఎన్నికల తర్వాత మొదలవుతుందని.. ఆయన పార్టీ మారుతారని విష్ణు అంటున్నారు. వైసీపీలో చేరేందుకే ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గంటా మళ్లీ నిలబడితే టీడీపీకి ఓట్లు వేయవద్దని ఆయన పిలుపునిచ్చారు.