గంగూలీకి గుండెపోటు ... సాయంత్రంలోపు ఆపరేషన్ !
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం కల్లా ఆయనకు యాంజియో ప్లాస్టీ చేయాలని డాక్టర్లు సూచించినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. గతలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. గంగూలీ హయాంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది.