ఆ రాష్ట్రానికి రెండో రాజధానిని డిసైడ్ చేశారు
ఒక రాష్ట్రానికి రెండో రాజధానిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంటే విమర్శలు.. ఆందోళనలు జరగటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా ప్రభుత్వం రెండో రాజధాని పై ప్రకటన చేయటాన్ని ఆ రాష్ట్ర ప్రజలు స్వాగతించటమేకాదు.. పండుగ చేసుకున్న వైనం ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. తాజాగా ఆ రాష్ట్రంలో రెండో రాజధానిగా సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పేర్కొన్నారు.
తాజాగా రెండో రాజధానికి సంబంధించిన ఉత్తర్వుపై గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆమోదం తెలపటమే కాదు.. ఇందుకు తగ్గట్లు అధికారిక నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఉత్తరాఖండ్ కు ఇప్పటివరకూ డెహ్రాడూన్ రాజధానిగా ఉంది. పరిపాలనా రాజధానిగా ఉన్న ఈ నగరంతో పాటు.. వేసవి రాజధాని గా చమోలీ జిల్లాలోని గైర్ సెయిన్ పట్టణాన్ని రెండో రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది.
గైర్ సెయిన్ ను వేసవి రాజధాని గా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాను ముఖ్యమంత్రి అయితే.. ఆ డిమాండ్ ను తీరుస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి.. అందుకు తగ్గట్లే తాము కొలువు తీరిన మూడేళ్లకు హామీ అమలు చేయటం గమనార్హం. రెండో రాజధాని కోసం ఉద్యమించిన ప్రజలకు రెండో రాజధానిని అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సో.. ఉత్తరాఖండ్ రెండో రాజధాని గా గైర్ సెయిన్ మారింది.