బయోడైవర్సిటీ ప్రమాదం...ముందే హెచ్చరించింది ఎవరో తెలుసా?
అచ్చం సినిమా సన్నివేశాల్ని తలపిస్తూ..గాల్లో పల్టీలు కొడుతూ ఫ్లై ఓవర్ మీదినుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి కిందపడిపోయి బీభత్సాన్ని సృష్టించి హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడేలా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆటోస్టాండ్‌లో నిలబడి ఉన్న సత్యవేణి (56) అనే మహిళపై కారు నేరుగా పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. పక్కనే ఉన్న ఆమె కుమార్తె ప్రణీత (26), కుర్బా (26), ఆటోడ్రైవర్ బాలునాయక్ (38) తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన నగరవాసులను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అయితే, ఇలాంటి ప్రమాదాన్ని ఓ వ్యక్తి ముందే ఊహించడం...ఏకంగా అధికారులను అప్రమత్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 1.19 గంటలకు రాయదుర్గం వైపు నుంచి మాదాపూర్ ఐటీ కారిడార్ వైపు వోక్స్‌వాగన్ పోలో (టీఎస్ 09 టీడబ్ల్యూ 5665) కారు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై 104 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఐటీకారిడార్ మలుపు వద్ద వేగం నియంత్రించకపోవడంతో ఎడమవైపు అంతే వేగంతో దూసుకెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టి గాల్లో ఎగిరింది. రెండుమూడు పల్టీలు కొట్టి కింద రోడ్డుమీద పడి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి అక్కడే నిలుచుని ఉన్న మహిళపై పడటంతో ఆమె మృత్యువాతపడ్డారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అయితే, ఫ్లై ఓవర్ నిర్మాణంలో కూడా పలు లోపాలు ఉన్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ఫ్లై ఓవర్ ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం కావడం ఇక్కడ ప్రస్తావనర్హం. సాధారణంగా ప్లై ఓవర్ గ్రౌండ్ క్లియరెన్స్ 5.5 మీటర్ల వరకు ఉంటుంది.. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్.. సెకండ్ లెవల్‌ది కావడంతో దీని ఎత్తు 18 మీటర్లు పెట్టారు. సుమారు 900 మీటర్ల పొడవైన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై దాదాపు 150 మీటర్ల మేర మలుపు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరగడానికి సహజంగానే ఎక్కువ అవకాశం ఉంటుంది. పైగా వన్‌వే అవడంతో ...వేగం ఏమాత్రం నియంత్రణలో ఉండదు. ఇదే విషయాలను పేర్కొంటూ గతంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారుల ముందు జాగ్రత్తపై సందేహాలను పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే..ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడతారా...కేవలం స్పీడ్ గన్‌లు పెట్టి ఫైన్‌లు వసూలు చేసుకుంటారా? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.