నెస్లే టైం అస్సలు బాగోలేదు

Update: 2015-06-26 08:18 GMT
ప్రముఖ ఆహార ఉత్పత్తుల బహుళ జాతి సంస్థ నెస్లే టైం అస్సలు బాగోలేదన్నట్లుగా ఉంది. ఇప్పటికే మ్యాగీ వివాదంతో తల బప్పి కట్టి ఉన్న ఆ సంస్థ.. పాతాళానికి పడిపోయిన తన పరపతిని పెంచుకోవటం కోసం కిందామీదా పడుతోంది. దేశవ్యాప్తంగా మ్యాగీ మీద ఆంక్షలు వ్యక్తం కావటం.. మార్కెట్‌లో ఉన్న దాదాపు రూ.300కోట్ల మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఆ సంస్థకు చెందిన చిన్నపిల్లల ఆహారం అందించే సెరెలాక్‌లో ప్యాకెట్‌లో పురుగులు బయటపడటం కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డిలో ఈ ఉందం చోటు చేసుకుంది. ఒక మెడికల్‌ షాపులో తాను కొన్న సెరిలాక్‌ పాకెట్‌లో పురుగులు ఉన్నాయంటూ రాజేశ్‌ అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించాడు.

అయితే.. ఎక్సపైరీ అయిన ఉత్పత్తుల్ని కొన్ని షాపుల వారు నిర్లక్ష్యం కారణంగా కానీ.. పని ఒత్తిడి వల్ల కానీ మర్చిపోతుంటారని.. ఇలాంటి సందర్భంలో ఇలాంటి చోటు చేసుకుంటాయే తప్పించి.. సెరిలాక్‌లో నాణ్యత పరంగా ఎలాంటి లోపాలు ఉండవని చెబుతున్నారు. మరి.. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News