సీఎం జగన్ నివాసానికి రక్షణ చర్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ రక్షణ చర్యలను పోలీసులు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కాన్వాయ్ లోని పాత కార్లను తొలగించే ఇటీవలే కొత్త అత్యాధునిక బుల్లెట్ ఫ్రూఫ్ కార్లను ప్రవేశపెట్టారు. ఇక చంద్రబాబు హయాంలో వాడిన కార్లను హైదరాబాద్ కు వెళ్లినప్పుడు అక్కడ జగన్ వినియోగించేలా పంపించారు.
ఇక హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడం.. తెలంగాణతో పలు విభజన చర్చలు కూడా జరుపుతుండడం.. పైగా హైదరాబాద్ లోనే జగన్ నివాసం లోటస్ పాండ్ ఉండడంతో అక్కడ కూడా సీఎంకు భద్రత చర్యలు చేపట్టాలని తాజాగా పోలీసులు డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసంలో రక్షణ చర్యల కోసం ఏపీ ప్రభుత్వం తాజాగా 24 లక్షల 50వేల రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.
చంద్రబాబు హయాంలోనూ నాడు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి రక్షణ చర్యలు.. ఇతర వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. ఆ కోవలోనే ఇప్పుడు జగన్ నివాసానికి కూడా పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు.