బరాత్ కు సమయం ఇవ్వలేదని పెళ్లికొడుకుపై రూ.50 లక్షల స్నేహితుల పరువునష్టం దావా

Update: 2022-06-28 10:44 GMT
పెళ్లికి స్నేహితులను ఆహ్వానించిన పెళ్లికొడుకు అతడు రాకముందే పెళ్లి బరాత్ నిర్వహించడం వివాదాస్పదమైంది. పెళ్లికి పిలిచి తమను అవమానించాడని.. తమ పరువుకు భంగం వాటిల్లిందని ఏకంగా స్నేహితుడికే షాక్ ఇచ్చారు. పెళ్లికొడుకుపై 50 లక్షల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఇది అందరినీ షాక్ కు గురిచేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ చోద్యం చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో వివాహం చేసుకుంటున్న ఓ యువకుడు పెళ్లికి తన స్నేహితులను ఆహ్వానించాడు.  స్నేహితులతో కలిసి సరదాగా బరాత్ లో డ్యాన్సులు వేయాలని ముందుగానే స్నేహితులు ప్లాన్ చేశారు. వారికి పెళ్లికొడుకు సమయం కూడా ఇచ్చాడు.

అయితే నిర్ణీత సమాయానికి కంటే ముందుగానే వరుడి స్నేహితులు రాకముందే బరాత్ చేసి పెళ్లికొడుకు వెళ్లిపోయాడు. దీంతో స్నేహితులు వరుడు చేసిన పనికి తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఐదు గంటలకు బరాత్ అని చెప్పి వరుడు ముందే వెళ్లిపోయాడని స్నేహితులు అలిగారు. అంతేకాదు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు.

వరుడిపై పరువు నష్టం దావా వేశారు. వరుడి నుంచి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టులో దావా వేశారు. రవి తన పెళ్లికి ఆహ్వానం కార్డులు పంచేందుకు తన స్నేహితుల్లో ఒకరికి సాయం కోరాడు.

అతడి మిత్రుడు , చంద్రశేఖర్ రవి పెళ్లి కోసం ఎంతగానో సహాయం చేశారు. అయితే బరాత్ రోజు రవి చెప్పిన సమయం కంటే ముందుగానే వెళ్లిపోవడంతో చంద్రశేఖర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

పెళ్లిపనుల్లో తమను అవసరం కోసం వాడుకొని తీరా సమయానికి తమకు చెప్పకుండా బరాత్ కు వెళ్లాడని.. అదేమని ప్రశ్నిస్తే తమను అవమాన పరిచాడని వరుడు రవిపై నిప్పులు చెరిగిన స్నేహితుడు అతడిపై పరువు నష్టం దావా వేశారు. ఈ విచిత్రమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News