నాలుగేళ్ల చిన్నారి రేప్ చేసి చంపేశారు.. దారుణం తట్టుకోలేక తండ్రి సూసైడ్

Update: 2021-03-14 08:30 GMT
ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో చిన్నారులపై దారుణ రీతిలో అత్యాచారాలు జరగటం ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా ఉదంతం అంతకు మించిందింగా చెప్పాలి. అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం దాన్ని బ్యాగులో కుక్కి బయటకు విసిరి పారేశారు. తెలిసినంతనే వేదన చెందే ఈ ఉదంతంలోకి వెళితే..

దాద్రా నగర్ హవేలీ లోని నరోలి గ్రామ సొసైటీలో బాధిత కుటుంబం ఉంటోంది. ఆడుకోవటానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి చీకటి పడినా ఇంటికి రాలేదు. దీంతో.. ఆమె కోసం తల్లిదండ్రులు వెతికారు. ఎంతకూ కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అపార్ట్ మెంట్ టాయిలెట్ పైప్ లైన్ పక్కనే ఉన్న ఒక బ్యాగులో పాప డెడ్ బాడీని గుర్తించారు. దీంతో.. సొసైటీలోని 40 ప్లాట్లను తనిఖీ చేశారు. అందులో ప్లాట్ నెంబరు 109లో రక్తపు మరకలతో పాటు.. బాత్రూం కిటికీ పగిలి ఉండటంతో అందులో ఉంటున్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

చిన్నారిపై అత్యాచారం చేసి.. అనంతరం బ్యాగులో డెడ్ బాడీని పెట్టి.. బాత్రూం కిటికీ నుంచి బయటకు విసిరేసినట్లుగా సదరు యువకుడు తాను చేసిన దారుణాన్ని ఒప్పుకున్నాడు. ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని చిన్నారి తండ్రి పినాయిల్ తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ రెండు ఉదంతాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 
Tags:    

Similar News